ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:02 AM
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
బీర్‌పూర్, జూన 26(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం బీర్‌పూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి అడ్లూరి ప్రారంభించారు. మంత్రి హోదాలో మండలానికి మొదటిసారిగా వచ్చిన ఆయన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి బీర్‌పూర్ లక్ష్మినరసింహా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ శేష వసా్త్రలు కప్పి చిత్రపటాలను అందించారు. ఆలయం వెనుక భాగంలో భక్తుల సౌకర్యార్థం ప్లోరింగ్ పెంచడం కోసం మంత్రి, ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా కోటి 60 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేదలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడానికి అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. బీర్‌పూర్ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతో పాటు సిబ్బంది ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఏఎనఎంలు, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక నిధులు తీసుకువచ్చి మారుమూల మండలాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు.
రోళ్లవాగు ప్రాజెక్టు సందర్శన
బీర్‌పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సందర్శించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రోళ్లవాగు ప్రాజెక్టుకు ఎలాంటి డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించారని ఆరోపించారు. 60 కోట్లతో ప్రారంభించిన రోళ్లవాగు ప్రాజెక్టు 2023 డిసెంబరు వరకు 100కోంట్ల 53లక్షల రూపాయలకు పెంచారని అన్నారు. అంచాలనాలు పెంచినప్పటికి రోళ్ళవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోళ్లవాగు ప్రాజెక్టుపై ప్రత్యేక దృస్టిసారించి అన్నాదాతలకు సాగు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం నిర్మాణ సంస్థలకు ఇవ్వాల్సిన రూపాయలు 40కోట్లు చెల్లించడంతో పాటు రెవెన్యూకు సంబందించిన 800 ఎకరాల భూమిని అప్పగించడం జరిగిందని వివరించారు. రిజర్వు ఫారెస్ట్ అనుమతుల కోసం రూపాయలు 32లక్షలు డిపాజిట్ చేశామని, రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులతో పాటు అటవీ శాఖ అనుమతులు సాధించి ఈ వానాకాలంలో సాగు నీటిని రైతులకు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 15 రోజుల్లో ప్రాజెక్టు గేట్లు బిగించి 0.25 టీఎంసీల నీటిని నిల్వ యేసి రైతులకు వానకాలం సీజనలో సాగు నీటిని అందిస్తామని తెలిపారు. రోళ్ళవాగు ప్రాజెక్టు కాల్వ లైనింగ్ పనులకు అంచనాలు తయారు చేయాలని సంబంధిత అఽధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన దినేష్, జిల్లా వైధ్యాధికారి సుజాత, జిల్లా ఉప వైధ్యాఽధికారి శ్రీనివాస్, డిఎఫ్‌వో రవికుమార్, ఆర్‌డీవో మధుసూదన, ఈఈ లక్ష్మణ్‌రావ్, డీఈ మిలింద్, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పా రాంచంధర్ రావ్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేష్, మండల వైధాధికారి రాధ రెడ్డి, సర్పంచ హరీష్, సర్పంచల ఫోరం అధ్యక్షులు అర్శకోట రాజగోపాల్‌రావు పాల్గొన్నారు.