మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:56 AM
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం, మారుపాక, చీర్లవంచ, గుర్రవానిపల్లి, కొడుముంజ గ్రామాల్లో రూ. 50 లక్షలతో ఐదు మహిళా సమైక్య సంఘం భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుం బానికి అండగా నిలుస్తున్నాయని అన్నారు. మహిళలు సాధికారత సాధించేవరకు ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుంద న్నారు. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా ఆర్థికంగా నిల బెడుతూ వ్యాపార రంగంలో నిలదొక్కుకునేలా సీఎం చర్యలు తీసుకుం టున్నారన్నారు. ఇందులో బాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వ రులుగా చేయాలని సంకల్పించారన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలని పావలా వడ్డీ రుణాలు అందించి మహిళా సంఘాలకు బలమైన ఊతమిచ్చారన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోకుండా సభ్యులను కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితం చేసిందన్నారు. ప్రస్తుతం మహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటివరకు మూడు సార్లు మహిళా సంఘాలు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. మహిళల సాధికారత కోసం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం, గ్యాస్‌సిలిండర్ వంటి కార్యక్ర మాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ రొండి రాజు, సర్పంచ్‌లు సెర్ల రాజేశ్వరి, దొబ్బల మల్లేశం, కొలుగూరి కిరణ్మయి, స్వాతిజల, కదిరె రాజకుమా ర్‌లు పాల్గొన్నారు.