అన్నదాతకు అండగా.. పీఎం కిసాన్ మాన్‌ధన్
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:58 AM
వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (పీఎంకేఎంవై) రైతులకు వరంగా మారుతోంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (పీఎంకేఎంవై) రైతులకు వరంగా మారుతోంది. వృద్ధావ్యంలోకి వచ్చాక చాలా మంది రైతులకు ఎలాంటి ఆదాయ వనరులు ఉండవు. ఈ నేపథ్యంలో వయస్సు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన రైతులకు ప్రతీ నెల 3 వేల రూపాయల చొప్పున పిం ఛన్ జీవిత కాలం అందుతుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న, రెండు హెక్టార్ల వరకు సాగు భూమి కలిగిన రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఎప్పుడైనా నమోదు చేసుకున్నప్పటికీ, 60 ఏళ్లు పూర్తయిన తర్వాతే పింఛన్ అందుతుంది. అయితే ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, జాతీయ పెన్షన్ గానీ, ఇతర చట్ట బద్ధ సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు. ఈ పెన్షన్ అందే వరకు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పథకంలో చేరే వారి వయస్సు ఆధారంగా ప్రీమియం ఉంటుంది. రైతు చెల్లించినంతే ప్రభుత్వం కూడా తన వంతుగా బీమా కంపెనీకి నగదు జమ చేస్తుంది.
ఫ వయస్సు ఆధారంగా ప్రీమియం..
పథకంలో చేరే సమయంలో రైతు వయస్సు ఆధారంంగా నెల వారీ ప్రీమియం 55 నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. రైతు చెల్లించిన ప్రీమి యం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సమానంగా చెల్లిస్తుం ది. 18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు 55 రూపాయలు, 30 ఏళ్ల వస్సులో చేరితే 110 రూపాయలు, 35 ఏళ్ల వయస్సులో 150 రూపాయలు, 40 ఏళ్ల వయస్సులో 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రైతు మర ణిస్తే భార్య ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. 60 ఏళ్ల తర్వాత రైతు మరణిస్తే భార్యకు నెలకు 1500 రూపా యల పెన్షన్ వస్తుంది. రైతు ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం, సాగు భూమి, ఆదాయం వంటి వివరాలు, పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఫ దరఖాస్తు చేసుకోవడం ఇలా..
పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్‌లోకి వెళ్లి పీఎం కిసాన్ పీఎం కేఎంవై పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రైతు మొదట తన ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పీఎం కిసాన్ పథకానికి నమోదైన బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం డబ్బులను చెల్లించాలి. ప్రతీ నెల ఆటోమెటిక్‌గా డబ్బులు ఖాతా నుంచి పథకానికి జమ అవుతాయి. నామినీ వివరాలను నమోదు చేయాలి. మాన్‌ధన్ దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని రైతు సంతకం చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. వెంటనే మీకు పీఎం కిసాన్ మాన్‌ధన్ పింఛన్ కార్డు జనరేట్ అవుతుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రతీనెల బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం డబ్బులు పీఎంకేఎంవై పథకానికి ఆటోమెటిక్‌గా జమ అవుతాయి. పీఎం కిసాన్ మాన్‌ధన్ లబ్ధిదారులు కానట్లయితే కామన్ సర్వీస్ సెంటర్లో మ్యానువల్‌గా దరఖాస్తు చేసుకొని పింఛన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రీమియం డబ్బులను నగదు రూపంలో చెల్లించాలి. తరువాత బ్యాంక్ ఖాతాను జత చేసుకోవాలి.
ఫ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం...
- బి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
పీఎం కిసాన్ మాన్‌ధన్ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతువేదికల్లో జరిగే సమా వేశాలతో పాటు వ్యక్తిగతంగాను పథకం గురించి తెలి యచేస్తున్నాం. ఈ పఽథకం రైతులకు వృద్ధాప్యంలో ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం ఏవోలను సంప్రదించాలి.