ఎస్సెస్సీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:28 AM
పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి రాము సూచించారు.
జిల్లా విద్యాధికారి రాము
మల్యాల, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి రాము సూచించారు. మల్యాల మండలంలోని తాటిపల్లి గురుకుల పాఠశాల, జడ్పీ పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ప్రీపైనల్ పరీక్షలపై దృష్టి సారించాలని అన్నారు. అనంతరం తాటిపల్లిలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఎఫ్‌ఎల్‌ఎస్ విద్యార్థులను పరీక్షించారు. ఈ నెల 26న జరిగే ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షలకు విద్యార్థులను సిద్దం చేయాలని ఉపాద్యాయులకు సూచించారు. డీఈవో వెంట ఏఎంవో చంద్రశేఖర్‌రెడ్డి, మండల విద్యాధికారి జయసింహారావు, ప్రిన్సిపాల్ మానస, ప్రధానోపాద్యాయులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.