Share News

క్రీడలు స్నేహభావాన్ని పెంచుతాయి..

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:24 AM

క్రీడలు స్నేహభావాన్ని పెంచుతాయని సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌ అన్నారు.

క్రీడలు స్నేహభావాన్ని పెంచుతాయి..

వేములవాడ టౌన్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): క్రీడలు స్నేహభావాన్ని పెంచుతాయని సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌ అన్నారు. శనివారం వేములవాడ బాలనగర్‌లోని క్రీడా మైదానంలో బార్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో రిపబ్లిక్‌ డే సందర్భంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లకు నిర్వహించిన క్రికెట్‌ పోటీలను ఆయన టాస్‌ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలన్నారు. తప్పనిసరిగా ఏదో ఒక క్రీడలో భాగస్వాములు కావాలన్నారు. క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు టీ షర్ట్స్‌ అందజేశారు. ఈ క్రికెట్‌ పోటీల్లో న్యాయవాదులు రెండు జట్లు, కోర్టు సిబ్బంది ఒక జట్టు తలపడగా ఫైనల్‌ విజేతగా న్యాయవాదుల జట్టు గెలు పొందింది. విజేతలకు ఈనెల 26న రిపబ్టిక్‌ డే రోజు బహుమతులు అంద జేస్తారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అద్యక్షులు గుడిసె సదా నందం, క్రీడల కార్యదర్శి గుజ్జె మనోహర్‌, సీనియర్‌, జూనియర్‌ న్యాయ వాదులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 12:24 AM