Share News

క్రీడలు మానసికోల్లాసానికి దోహదం

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:43 AM

క్రీడలు శరీర దృడత్వం మా నసిక ఉల్లాసానికి దోహదపడతాయని డీఎస్పీ కే నాగేంద్రచారి అన్నారు.

క్రీడలు మానసికోల్లాసానికి దోహదం

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : క్రీడలు శరీర దృడత్వం మా నసిక ఉల్లాసానికి దోహదపడతాయని డీఎస్పీ కే నాగేంద్రచారి అన్నారు. సిరిసిల్ల కుంగ్‌ఫూ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన వేదశ్రీ స్మారక కరా టే, కుంగ్‌ఫూ, జూడో టైక్వాండో బాక్సింగ్‌ వేసవి శిక్షణ శిభిరం ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డీఎస్పీ నాగేంద్రచారి వేసవి శిక్షణ శిబిరంలో 45 రోజుల పాటు శిక్షణ పొందిన విద్యార్థులకు పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ నిత్య జీవితంలో కూడా క్రీడా స్ఫూర్తితో బ్రతకాలన్నా రు. ఎంచుకున్న క్రీడల్లో విద్యార్థులు రాణించాలంటే నిత్య సాధన చాలా ముఖ్యమన్నారు. శిబిరంను నిర్వాహకులు ఓరగంటి రామకృష్ణ, శిక్షకులను అభినందించారు. అనంతరం ముఖ్య అతిథి డీఎస్పీని అకాడమీ సభ్యులు సన్మానించారు. జూడో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కోచ్‌ మార్వాడి సుదర్శన్‌, మాస్టర్‌ ఓరగంటి ఉమా,బండి నరసయ్య, నాగుల కనకయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:43 AM