Share News

కోర్టులు, పోలీసుల సమన్వయంతోనే ప్రజలకు సత్వరన్యాయం

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:21 AM

న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత సులభంగా, వేగ వంతంగా, పారదర్శకంగా అందించాలంటే కోర్టులు, పోలీస్‌ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమ ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అ న్నారు.

కోర్టులు, పోలీసుల సమన్వయంతోనే  ప్రజలకు సత్వరన్యాయం
ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జగిత్యాల టౌన, జనవరి 9(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత సులభంగా, వేగ వంతంగా, పారదర్శకంగా అందించాలంటే కోర్టులు, పోలీస్‌ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమ ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అ న్నారు. జగిత్యాల జిల్లా కోర్టు ప్రాంగణం లో శుక్రవా రం జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయమూ ర్తులు, పోలీస్‌ ఉన్నతాధికారులుతో జిల్లా కోర్టు కోఆర్డినేషన కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులు, వాటి పురోగతి, దర్యాప్తు నాణ్య త, చార్జ్‌షీట్‌లను సకాలంలో దాఖలు చేయడం, సమన్ల అమలు, నాన బెయి లబుల్‌ వారెంట్‌ల అమలు, సాక్షుల హాజరు, ఫోరెన్సిక్‌ నివేదికలు వంటీ కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగిం ది. లోక్‌ అదాలత ద్వారా 1051 కేసుల పరిష్కారానికి కృషి చేసిన న్యాయమూర్తులను, బార్‌ అసోసియేషన, పోలీస్‌ అధికారులను అభినందిస్తు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి ప్రశం సాపత్రాలు అందజేశారు. ఎస్పీ అశోక్‌కుమార్‌, అదనపు జిల్లా జడ్జి నారాయణ, జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి వెంకట మల్లిక్‌ సుబ్రమణ్య శర్మ, సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌ రావు, మేజిసే్ట్ర ట్‌లు శ్రీనిజ కొహిర్కార్‌, అరుణ్‌ కుమార్‌, పావని, నికిషా, డీఎస్పీలు రఘుచందర్‌, రాములు, బార్‌ అసోసి యే షన అధ్యక్షుడు శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:21 AM