Share News

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

ABN , Publish Date - May 15 , 2026 | 11:55 PM

కొనుగోళు కేంద్రాల్లో వేగం పెంచి ధాన్యాన్ని రైస్‌మిల్లులతోపాటు గోదాంలకు తరలించాలని ప్రభు త్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

సిరిసిల్ల అర్బన్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : కొనుగోళు కేంద్రాల్లో వేగం పెంచి ధాన్యాన్ని రైస్‌మిల్లులతోపాటు గోదాంలకు తరలించాలని ప్రభు త్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. అలాగే రైస్‌మిల్ల ర్లు ధాన్యంను అన్‌లోడింగ్‌ చేసుకోవాలన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలో ని పెద్దూర్‌ శివరు అపెరల్‌ పార్క్‌లోని గోదాంలలో ధాన్యం నిల్వలను శుక్రవారం అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలోకంటే తమ ప్రభుత్వం ధాన్యంను వేగంగా కొనుగోలు చేస్తోం దన్నారు. ఈసారి ధాన్యం తరలించేందుకు లారీలతోపాటు డిసీఎం వ్యాన్‌లు, ట్రాక్టర్‌లకు అనుమతులు ఇచ్చామన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ఽధాన్యంను కొనుగోలు చేసిన గోదాంలకు తరలించాలని కోరారు. డ్రైవర్‌లతోపాటు రైతులకు భోజనవసతిని కల్పించాలని అధికారులను అదేశించారు. రైతులు ప్రభు త్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్‌ కమి టీ చైర్స్‌పర్సన్‌ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోదాంలలో హమాలీలను పెంచాలి : కలెక్టర్‌

కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యంను లారీలతోపాటు ఇతర వాహనాలల్లో సిరిసిల్ల అపెరల్‌ పార్క్‌లోని గోదాంలకు తరలించిన బస్తాలను అన్‌లోడింగ్‌ చేయడానికి హమాలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూర్‌ శివారులోని అపెరల్‌ పార్క్‌లో గోదాంలను శుక్రవా రం అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి కలెక్టర్‌ సందర్శించి ధాన్యం అన్‌లోడింగ్‌ను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం నిల్వచేసేందుకు అందుబాటులో ఉన్న షెడ్‌ల వివరా లను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం దృష్ట్యా హమాలీల కోసం త్రాగునీరు. భోజనం తదితర సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇప్పటివరకు ఎన్ని లారీ వచ్చాయి ఎన్ని లారీల ధాన్యం అన్‌లోడింగ్‌ చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొను గోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్‌లోడింగ్‌ చేయాలని సూచించారు. వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసఫరాల అధికారి బుచ్చిబా బు, మేనేజర్‌ నర్సింహ, కార్మిక శాఖ అధికారి నజీర్‌అహ్మద్‌, తహసీల్దార్‌ మహేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 11:55 PM