Share News

దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:32 AM

మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.

దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు

ఎల్లారెడ్డిపేట, అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భా గంగా మండల కేంద్రంతో పాటు పదిర, అక్కపల్లి, గొల్లపల్లి, వెంకటాపూర్‌, బొప్పాపూర్‌, నారాయణపూర్‌, దుమాల, అల్మాస్‌పూర్‌, తిమ్మాపూర్‌, సింగారం, బండలింగంపల్లి, తదితర గ్రామాల్లోని దుర్గామాత సన్నిధుల్లో ఆది వారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు దుర్గామాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భక్తిశ్రద్ధలతో కొలిచారు. మహిళ లు మంగళహారతులు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాల్లోని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని దేవీ సన్నిధు ల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌ : శరన్నవరాత్రి ఉత్సవాలు సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని గ్రామాల్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్దూర్‌, జగ్గారావుప ల్లె, చంద్రంపేట, చిన్నబోనాల గ్రామాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా ఆదివారం దేవి మండపాల్లో ప్రజలతోపాటు అమ్మవారి దీక్షాదారులు ప్రత్యేక పూజలను చేపట్టారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండపంలో మహిళలు పలు వంటకాలతో నైవేధాన్ని అందించి ప్రత్యేకం పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు దొంతినేని కళ్యాణి, లింగంపల్లి భాగ్యలక్ష్మీ సత్యనారాయణ, బోల్గం వైష్ణవినా గరాజుగౌడ్‌, మొగిలి నాగరాజు, మాజీ సర్పంచ్‌ అదిపెల్లి లక్ష్మీదేవయ్యగౌడ్‌, నాయకులు నాగుల ఎల్లం, సుంకరి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:32 AM