సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:17 AM
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా అయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, పక్కా ప్రణా ళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు.
సిరిసిల్ల, జూలై 8 (ఆంరఽధజ్యోతి): జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా అయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, పక్కా ప్రణా ళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యాధుల నియంత్రణ,వైద్య ఆరోగ్య శాఖ సేవలపై వైద్య ఆరోగ్య శాఖ, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ శాఖ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాల నియంత్రణ సాధ్య మని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే తప్పకుండా పాటించాలని గ్రామాల్లో, మున్సిపాలిటీలో సంబంధిత అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి నిలువ నీటి ని ఉండకుండా చూడాలని పరిసరాలు పరిశుభ్రంగా చూసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎక్కడైనా జ్వరాల వ్యాప్తి ఉంటే వెంటనే ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని, కావాల్సిన మందులు వైద్యం అందజేయాలని సూచిం చారు. జిల్లాలోని అన్ని నీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని, క్లోరినే షన్ పక్కాగా చేయించాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లోని ఆర్‌ఓ ప్లాంట్ల ను తనిఖీ చేయాలని, నీటి నాణ్యత పరీక్షలు చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఆర్‌ఓ ప్లాంట్లు తనిఖీ చే యాలన్నారు. వైద్యులు తమ పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాల యాల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై అవగాహన అవగాహన కల్పించాలని ఆదేశించా రు. మండల వైద్య అధికారులు అన్ని శాఖల అధికారులతో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులు, అలాగే పరిస రాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛమైన నీటిలో డెంగ్యూ దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని దీనిపై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే నిర్వహించాలని ఆదేశించారు వర్షాలు కురిసిన మరుసటి రోజు నీటి నిలువలు ఉన్నచోట కచ్చితంగా డ్రైడే నిర్వహిం చాలని నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయాలని బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని సూచించారు. ఓపెన్ ప్లాట్లు ఉన్న గ్రామాలు, పట్టణాల్లోని యజమానులకు నోటీసులు జారీ చేసి నీరు నిల్వ ఉండకుండా చూసుకునేలా చూడాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలపై అవగాహన..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న సేవలపై విస్తృ త అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భిణుల నమోదు వంద శాతం చేయాలని, వారికి క్రమం తప్పకుండా పరీక్షలు వైద్యం, మందులు అందజేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు అయ్యేలా చూడాలని, నార్మల్ డెలివరీలు అయ్యేలా అవగాహన కల్పిం చాలన్నారు. అన్ని రకాల వ్యాక్సిన్ల పంపిణీ లక్ష్యం పూర్తిచేయాలని ఆదే శించారు. ఆస్పత్రులకు వచ్చే వారికి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఘన వ్యర్థాల నిర్వహణ పాటించాలి
ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ-2026 పై అవగాహన కల్పించేందుకు నాలుగు రంగుల చెత్త డబ్బాలతో చెత్తను వేరు చేసే విధానాన్ని సూచించే నమూనాను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీపీవో జయశీల, డీఎంహెచ్‌వో ఏంజెలాఆల్ర్ఫెడ్,డీసీహెచ్‌ఎస్ రవీందర్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.