Share News

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:36 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ మహేశ్‌. బి. గితే అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ మహేశ్‌. బి. గితే అన్నారు. అన్ని మండలాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్‌-ఆలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో స్థానిక అశ్విని ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేశ్‌. బి. గితే మాట్లాడుతూ ప్రజ లు, డ్రైవర్ల భద్రత పోలీసుల బాధ్యత అని అన్నారు. దీర్ఘకాలం పాటు వాహనాలను నడిపే డ్రైవర్లు కంటి చూపును నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. స్పష్టమైన చూపు లేకపోవడం, విశ్రాంతి లేకుండా వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని అన్నారు. ప్రతి మూడు మాసాలకొకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించాలని అన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రధాన ప్రాంతాలను గుర్తించామని పేర్కొన్నారు. ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టామని అన్నారు. అతి వేగం, మద్యం మత్తు, సెల్‌ఫోన్లు మాట్లాడుతూ వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్‌. బి. గితే హెచ్చరించారు. వైద్య శిబిరానికి సహకరించిన అశ్విని ఆసు పత్రి యాజమాన్యం, వైద్యుడు అభినయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డ్రైవర్లకు మందులు, కళ్లజోడులను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు రాహుల్‌రెడ్డి, లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:36 AM