Share News

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:48 PM

వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి, భీమన్న ఆలయంలో నిర్వహించే సీతారా ముల కల్యాణానికి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా ప్రత్యేక చర్యలు చేపట్టా లని ఎస్పీ మహేష్‌ బి గితే అన్నారు.

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు

వేములవాడ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి, భీమన్న ఆలయంలో నిర్వహించే సీతారా ముల కల్యాణానికి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా ప్రత్యేక చర్యలు చేపట్టా లని ఎస్పీ మహేష్‌ బి గితే అన్నారు. సీతారాముల కల్యాణో త్సవానికి జరుగుతున్న ఏర్పాట్ల ను మంగళవారం స్థానిక అధికా రులతో కలిసి ఏర్పాట్లను పరిశీ లించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు కల్యా ణానికి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని, కల్యాణా నికి వచ్చే భక్తులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు, దర్శనం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తూ ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు అనువుగా ద్వారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వెంట డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ వీరప్రసాద్‌, రాజన్న ఆలయ అధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 11:48 PM