Share News

మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:27 PM

మహిళ ల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు

సిరిసిల్ల, ఏప్రిల్‌ 8 (ఆంద్రజ్యోతి) : మహిళ ల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం కలెక్టరే ట్‌లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజు ల కార్యాచరణలో భాగంగా ఈనెల 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవాల సందర్భంగా సురక్షిత మాతృత్వ దినోత్సవం, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రభు త్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్‌, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌లు జిల్లాలోని 552 మంది అంగన్‌వాడీ కేంద్రాల బాధ్యులకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ పోస్టర్లను ఆవిష్క రించారు. సందర్భంగా ప్రభుత్వ విప్‌ శ్రీని వాస్‌ మాట్లాడుతూ గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలకు మెరుగైన సేవలు అం దుతున్నాయని పేర్కొన్నారు. ప్రసవానంతర తల్లులకు కూడా ఆరు నెలలపాటు పోషకా హారం అందిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజుల కార్యాచరణ వివిధ శాఖ లకు అప్పగించారని దీనిలో భాగంగా ఇప్పటి వరకు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయడం, అలాగే భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై ఒక నివే దిక సిద్ధం చేయడం జరుగుతుందని వివ రించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభి వృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో విజయ వంతంగా అమలుచేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలు రెండు మున్సిపాలి టీల పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు పగడ్బందీగా అమలు చేస్తున్నా రని స్పష్టంచేశారు. స్కానింగ్‌ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఎవరై నా అటువంటి చర్యలు పాల్పడితే కఠిన చర్య లు ప్రభుత్వం తీసుకుంటుందని హెచ్చరించా రు. గర్భిణులు, బాలింతలు తమ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వెల్లడించారు ఇందులో భాగంగా త్వరలో అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వివ రించారు. అన్ని హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, డైట్‌ చార్జీలు 40 శాతం పెంచామని, కాస్మెటిక్‌ చార్జీలు 200 శాతం పెంచామని తెలిపారు. అంగన్‌వాడీలకు ప్రతి ఇంటితో అనుబంధం ఉంటుందని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలు, వీవోఏ భవనా లు జిల్లాలో నిర్మిస్తున్నామని తెలిపారు. మ హిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కింద వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్‌ బంకులు, స్వయంఉపాధి యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పదివేల కోట్ల రూ పాయల విలువైన ఉచిత బస్సు ప్రయాణా లు చేశారని గుర్తుచేశారు. 60 ఏళ్ల వయస్సు దాటిన మహిళలందరికీ మహిళా సంఘాల్లో సభ్యత్వం కల్పిస్తుందని వివరించారు. అలాగే మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. 200 యూ నిట్ల ఉచిత విద్యుత్‌, రైతులకు రుణమాఫీ, నూతన రేషన్‌కార్డులు మంజూరు చేశామని, నూతన కుటుంబ సభ్యుల వివరాలు రేషన్‌ కార్డులో నమోదు చేస్తున్నామని తెలిపారు. సన్న బియ్యం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా ప్ర భుత్వం ప్రతి ఏడాది రూ.14,650 కోట్ల ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు పేదల సొంతింటి కల నిజం చేయడమే కా కుండా వివిధ వృత్తుల వారికి ఎందరికో ఉ పాధిని కల్పిస్తుందన్నారు. త్వరలో నూతన పెన్షన్‌లు అమలు చేయనుందని చెప్పారు.

పోషకాహారంపై అవగాహన కల్పించాలి

మహిళలు, గర్భిణులు, బాలింతలకు పోష కాహారంపె అవగాహన కల్పిస్తూనే అంగన్‌వా డీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు తప్పనిసరిగా మహిళలకు సేవలు అందించా లని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా వివిధ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ నిర్ణ యించిందని తెలిపారు. ఇందులో భాగంగా వైద్యారోగ్య శాఖ ఆరోగ్య వారోత్సవాలు నిర్వ హిస్తోందని వివరించారు.గర్భిణుల వివరాలు ఆసుపత్రుల్లో నమోదు కావాలని వారికి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని సూచించారు. అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు సమన్వయంతో మహిళలకు సేవలు అందించా లని, పోషకాహారం పక్కాగా పంపిణీ చేయాలని అన్నారు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న మందులను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. పిల్లలకు బాలింతలు తల్లిపాలు ఇచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా అంగన్వాడి కేంద్రాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. లింగ నిర్ధారణ చేసే ఆసుపత్రిలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలలతో సమానంగా బాలికల జననాలు నమోదు అయ్యేలా సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతమైన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగు ల సత్యనారాయణ గౌడ్‌, వేములవాడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ స్వరూపా రెడ్డి, వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కంరాజు, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 11:27 PM