గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:37 PM
వేములవాడలోని శ్రీ రాజరా జేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న తిప్పాపూర్ గోశాలలోని కోడెలు, గోవులను సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో ఎల్. రమాదేవి అన్నారు.
వేములవాడ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): వేములవాడలోని శ్రీ రాజరా జేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న తిప్పాపూర్ గోశాలలోని కోడెలు, గోవులను సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో ఎల్. రమాదేవి అన్నారు. సంబంధిత అధికారులతో కలిసి గోశాలను పరిశీలిం చారు. ఈ సందర్భనగా వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గోశాలలో గోవులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు. గోవులకు ఎండవేడి తగలకుండా షెడ్డు చుట్టూ గ్రీన్‌నెట్ ఏర్పాటు, కూలర్లు, ఫ్యాన్ల ఏర్పాటు, చలువపందిళ్ల ఏర్పాటు వంటి చర్యలను పరిశీలించారు. గోవులకు అం దిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోవులకు ఎలాంటి లోటు రాకుండా పూర్తి స్థాయి లో సంరక్షణ కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.