Share News

ఆలయ పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:28 AM

వేముల వాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయాల్లో పారి శుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆలయ ఈవో రమా దేవి అన్నారు.

ఆలయ పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు

వేములవాడ రూరల్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : వేముల వాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయాల్లో పారి శుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆలయ ఈవో రమా దేవి అన్నారు. స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహి స్తున్న ఔట్‌సోర్సింగ్‌ శానిటేషన్‌ సిబ్బందితో శుక్రవారం ఆమె సమావేశమాయ్యరు. ఈ సందర్బంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేసవి సెలవుల సమయంలో తీవ్ర ఎండల ఉన్నప్పటికి ఆలయ పరిసరాలు, అనుబంధ దేవాల యాల్లో, పార్కింగ్‌ ప్రాంగణాల్లో సిబ్బంది అంకితభావంతో పనిచేసి పరిశుభ్రతను కాపాడారన్నారు. రానున్న వర్షా కాలా న్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య చర్యలు చేపట్టాలని, వర్షాల కార ణంగా ఎక్కడా నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. దోమల నివార ణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్దందులు కలగకుండా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతీ ఉద్యోగి తప్పనిసరి గా డ్రెస్‌ కోడ్‌ పాటించాలన్నారు. శానిటేషన్‌ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీనెల 4 సెలవులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర శర్మ, ఏఈవో అశోక్‌ కుమార్‌, సూపరింటెండెంటు శ్రీనివాస్‌ శర్మతో పాటు ఆలయ ఉద్యో గులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:28 AM