Share News

చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:39 AM

జిల్లాలో పోషణ మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి

సిరిసిల్ల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పోషణ మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. బుధవారం రాజ న్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో 9వ జాతీయ పోషణ మాసంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టో బరు 8వ తేదీ వరకు నిర్వహించే పోషణ మాసంపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు ప్రతి నెలా తప్పనిసరిగా చూడాలని, ఆ వివరాలు అంగన్‌వాడీ యాప్‌లో నమోదు చేయా లని ఆదేశించారు. వారిలో సామ్‌, మామ్‌, ఎస్‌యూ డబ్ల్యూ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిం చారు. పిల్లల ఇంటికి అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు వెళ్లాలని, పోషకాహారం, సంరక్షణపై అవగాహన కల్పించాలని తెలిపారు. వారికి బాలామృతం, బాలా మృతం ప్లస్‌, ఆహార పదార్థాలు అందించాలని తెలి పారు. ఎదుగుదల లోపం, ఇతర ఇబ్బందులు ఉన్న పిల్లలను డీఈఐసీ కేంద్రానికి తరలించాలని ఆదేశిం చారు. పోషణ లోపం, తీవ్ర పోషణ లోపంతో బాధ పడుతున్న వారిని గుర్తించి అదనపు పోషకాహారం అందించడంతో పాటు వైద్య శాఖ సిబ్బంది సమన్వ యంతో వైద్య పరీక్షలు చేపట్టి పిల్లలు సాధారణ స్థితికి వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వేడివేడిగా ఇవ్వాలని సూచించారు. ఈనెల 21వ తేదీన అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశా లు నిర్వహించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యేలా చూడాలని సూచిం చారు. ప్రతి గ్రామంలో పంచా యతీ కార్యదర్శి, మున్సిపాలిటీ లోని అన్ని వార్డుల్లో వార్డు ఆఫీ సర్లు తమ పరిధిలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల లోపల, బయట పరి శుభ్రత పనులు చేయించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం జిల్లాలో పోషణ మాసం షెడ్యూల్‌, కార్యాచరణ ప్రణాళిక ను వివ రించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో లక్ష్మీనారా యణ, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌, డీఏవో అఫ్జల్‌ బేగం, డీసీఎస్‌వో డీఎం గోపాల్‌, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌ పాషా, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 12:39 AM