‘బ్రాండ్ తెలంగాణ’ బలోపేతంపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:35 AM
తెలంగాణను దేశ,విదేశీ పర్యాటకులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్ది ‘బ్రాండ్ తెలంగాణ’ను ప్రపంచస్థాయిలో బలో పేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
సిరిసిల్ల, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను దేశ,విదేశీ పర్యాటకులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్ది ‘బ్రాండ్ తెలంగాణ’ను ప్రపంచస్థాయిలో బలో పేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. మంగళవారం హైదరాబాదు నుంచి అన్ని జిల్లాల కలెక్ట ర్లతో వర్షాభావ పరిస్థితులు, నీట్- పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాజ న్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యం నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌లు హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభి వృద్ధి చేయాలని, ప్రతి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొం దించాలని సూచించారు. యాదాద్రి, భద్రాచలం, బాసర, వరంగల్, ఆలంపూర్, కీసరగుట్ట, కల్వకుర్తి, మెదక్, నల్గొండ, పోచంపల్లి, కరీంనగర్, చార్మినార్, గోల్కొండ, మేడిగడ్డ, మణుగూరు, ఏటూరునాగారం, నాగార్జునసా గర్, మహబూబ్‌నగర్, నర్సాపూర్, చేర్యాల తదితర ప్రాంతాలతోపాటు బౌద్ధ సర్క్యూట్‌లను సమగ్ర పర్యాట క గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, పార్కింగ్, తాగునీ రు, మరుగుదొడ్లు, విద్యుత్, శుభ్రత, సూచిక బోర్డులు, ఇతర సందర్శకుల సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదే శించారు. ప్రతి ప్రత్యేక పర్యాటక ప్రాంతానికి స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణ, బాధ్యతలు, కాలపరిమితి రూపొం దించి పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించా లని సూచించారు. స్థానిక కళలు, హస్తకళలు, స్థానిక ఆహారం, సంస్కృతికి ప్రాధాన్యమిస్తూ స్థానికులకు ఉపా ధిఅవకాశాలు కల్పించాలని, హోమ్‌స్టేలు, స్థానిక గైడ్ సేవలను ప్రోత్సహించాలని తెలిపారు. తెలంగాణ సం స్కృతి, కళలు, హస్తకళలు, చారిత్రక వారసత్వం, స్థానిక ఆహారం, పండుగలు, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా ‘బ్రాండ్ తెలంగాణ’కు ప్ర త్యేక గుర్తింపు తీసుకరావాలని తెలిపారు. ఫెయిర్లు, ఫెస్టి వల్స్ వారసత్వ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించా లని సూచించారు. సమగ్ర తెలంగాణ పర్యాటక పోర్టల్, కృత్రిమ మేధ ఆధారిత ప్రయాణ ప్రణాళికలు, రియల్ టైమ్ డేటా వ్యవస్థల ద్వారా పర్యాటకులకు సులభతర మైన, వ్యక్తిగతీకరించిన సేవలందించాలని తెలిపారు. ప ర్యాటక ప్రాంతాల సహజ, చారిత్రక ప్రత్యేకతలను కాపా డుతూ పర్యావరణహితంగా అభివృద్ధి చేయాలన్నారు.
నీట్ పీజీ పరీక్ష పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు
ఈనెల 30న నిర్వహించనున్న నీట్-పీజీ 2026 ప్రవే శపరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందు కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రం లోని 14జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో 17627 మంది అ భ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష ఉదయం 9గంటలకు ప్రారంభమై మధ్యా హ్నం 12.30 గంటలకు ముగుస్తుందని, అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాల కు చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూ చించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, విద్యుత్, జనరే టర్ బ్యాకప్, వెంటిలేషన్ తదితర మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండేలా ముంద స్తు తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. అభ్యర్థుల గుర్తింపు, తనిఖీలను నిబంధన ల ప్రకారం నిర్వహించాలని, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఏఐ గ్లాసెస్, స్పై కెమెరాలు తదితర నిషేధిత వస్తువుల ను అనుమతించరాదని ఆదేశించారు. ప్రశ్నాపత్రాల భద్రత, గోప్యతకు పూర్తి రక్షణ కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అన్ని శాఖలు సమ న్వయంతో పనిచేయాలని సూచించారు.
22 శాతం లోటు వర్షపాతం
రాష్ట్రంలో ప్రస్తుతం 22 శాతం లోటు వర్షపాతం నమోదైందని, సెప్టెంబర్ చివరి వరకు పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు సూచిం చినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమా రు 1.20 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరిగిందని, గత వానాకాలంలో సుమారు 1.38 కోట్ల ఎకరాల్లో సాగు జరిగినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు, సాగునీరు, తాగునీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టా లని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీవో శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా వైద్యాధి కారి ఏంజెలా ఆల్ర్ఫెడ్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.