బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:29 AM
బాలికల విద్య పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసర ముందని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు.
-అదనపు కలెక్టర్ బీఎస్ లత
జగిత్యాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): బాలికల విద్య పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసర ముందని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్‌కే కన్వెన్షన్‌లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రత్యే క అధికారులకు, మోడల్ స్కూల్, గర్ల్స్ హాస్టల్ కేర్ టేకర్లు, వార్డెన్లకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బీఎస్ లత మాటా ్లడుతూ బాలిక విద్య ఆవశ్యకత, వారి ఆరోగ్యంపై అవగాహన కలిగియుండాలన్నారు. శిక్షణలో నేర్చు కున్న అంశాలను బాధ్యతగా నెరవేర్చుతూ బాలి కల విద్యా ప్రగతికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, మాస్టర్ ట్రైనర్స్, జిల్లా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు సత్యనారా యణ, నీరజ, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.