Share News

భూభారతి, ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:42 PM

జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ, భూభారతి, సాదాబైనామా, ఎస్‌ఐఆర్‌లపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

భూభారతి, ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ, భూభారతి, సాదాబైనామా, ఎస్‌ఐఆర్‌లపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో భూముల రీ సర్వేలు, రెవెన్యూ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు, ఎస్‌ఐఆర్‌లపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సమీక్షించారు. వీటిపై తహసీ ల్దార్‌లు, సర్వేఅండ్‌ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే సర్వే చేసిన గ్రామాల రికార్డులు సంబంధిత తహసీల్దార్‌లకు అందజేయాలని ఆదేశించారు. భూము ల వివరాలను క్షేత్ర స్థాయిలో పక్కాగా సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుని రీసర్వే పూర్తి పారదర్శకతతో చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో సర్వే చేసే ముందు ఆయా భూముల సర్వే నంబర్ల వివరాలు జీపీవోలు, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా భూముల సమాచారం చేరవేయాలని తెలిపారు. గ్రామసరిహద్దుల రీసర్వే, ఇతర పనులనును తహసీల్దార్‌లు క్షేత్రస్థాయిలో నిత్యం పరిశీలించాలని సూచించారు. గ్రామహద్దుల రీ సర్వే చేసేటప్పుడు అటవీ శాఖ అధికారులు పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. సర్వే పూర్తి వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత మిగతా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల గుర్తింపు, పరిరక్షణ పక్కాగా పూర్తి చేయాలన్నారు. ప్రతి తహసీల్దార్‌ తమ పరిధిలోని కార్యాలయ సిబ్బంది, సర్వే అధికారులతో భూముల రీసర్వే, భూభారతి, సాదాబైనామా, ఎస్‌ఐ ఆర్‌ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. కుల, ఆదాయ ఇతర ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత సమయంలో జారీ చేయాలని సూచించారు. ప్రత్యేక ఓటర్‌ సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కింద జిల్లాలో నో మ్యాపింగ్‌ ఓటర్లు, అనామలీస్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేయా లని సూచించారు. షెడ్యూల్‌ రూపొందించి ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:43 PM