Share News

‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:36 AM

జిల్లాలో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచే దిశగా విద్యాశాఖ అధికారులు సమగ్రప్రణాళిక రూపొందించారు. విద్యార్థులు పరీక్ష సమయంలో కాకుండా ఇప్పటి నుంచే అభ్యాసంపై దృష్టిపెట్టేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

- వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రణాళిక

- డిసెంబరు 31వతేదీ వరకు అమలు

- సాయంత్రం 4.15నుంచి 5.15గంటల మధ్య సన్నద్ధత

- వచ్చే యేడాది జనవరి 1నుంచి రెండు పూటలు నిర్వహణ

- జిల్లాలో సుమారు 13,540మంది పదో తరగతి విద్యార్థులు

జగిత్యాల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచే దిశగా విద్యాశాఖ అధికారులు సమగ్రప్రణాళిక రూపొందించారు. విద్యార్థులు పరీక్ష సమయంలో కాకుండా ఇప్పటి నుంచే అభ్యాసంపై దృష్టిపెట్టేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. గతనెల 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 31వరకు ఈ ప్రత్యేక సెషన్లు కొనసాగనున్నాయి. వచ్చే యేడాది జనవరి 1వతేదీ నుంచి రెండుపూటల ప్రత్యేకతరగతులు నిర్వహించడానికి కసరత్తులు జరుగుతు న్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వపాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, రెసిడెన్షియల్‌ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేకతరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 13,540మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు.

సమయ పట్టిక..

ప్రస్తుతం జిల్లాలోని పాఠశాలల్లో సాయంత్రం 4.15నుంచి 5.15గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జనవరిలో ప్రతిరోజు రెండుసార్లు తరగతులు నిర్వహిస్తారు. ఉదయం 8గంటల నుంచి 9గంటల వరకు ఉండనున్నాయి. ఈ తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులపై దృష్టిసారించడం, ఆత్యవిశ్వాసం పెంచడం, సందేహాలు నివృత్తి చేయడం తదితర కార్యక్రమాలు ఉంటాయి.

వారానికోసారి సమీక్ష..

ప్రతీ పాఠశాలలో వారానికి ఒకసారి ప్రత్యేకతరగతులపై సమీక్ష జరుగుతుంది. మండల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాల అమలును పరిశీలిస్తారు. విద్యార్థుల అభ్యసన స్థాయి, మార్కుల పెరుగుదల వంటి అంశాలను రికార్డులుగా నమోదుచేయాలి. హాజరు కాని విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు స్వయంగా సందర్శించి హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.

మార్గదర్శకాల ఇలా..

ఫ ఉపాధ్యాయులు సిలబస్‌ను జనవరి 10లోపు పూర్తి చేయాలి.

ఫ ఆ తరువాత రివిజన్‌ తరగతులు ప్రారంభించాలి. ఎస్‌ఏ-1 పరీక్షల పలితాల ఆధారంగా విద్యార్థులను ఏబీసీ గ్రూపులుగా విభజించాలి.

ఫ సీ గ్రూప్‌ విద్యార్థులకు పునశ్చరణ తరగతులు, స్లిప్‌ టెస్టులు నిర్వహించాలి.

ఫ ప్రతీ ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకొని, వారిని వ్యక్తిగతంగా మార్గదర్శనం చేయాలి.

ఫ విద్యార్థుల హాజరును 100శాతం సాధించేలా పర్యవేక్షణ చేస్తారు.

ఫ సద్వినియోగం చేసుకోవాలి

- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి, జగిత్యాల

పదో తరగతి విద్యార్థులకు జిల్లాలో ముందస్తుగానే కొన్ని నెలల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయుల కొరత లేకుండా ఇతర పాఠశాలల నుంచి సర్దుబాటు చేస్తున్నాం. ప్రత్యేకతరగతుల్లో విద్యార్థులు వందశాతం హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. పదిలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికను రూపొందించాం.

Updated Date - Nov 07 , 2026 | 01:36 AM