‘ప్రగతి ప్రణాళిక’పై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:20 PM
ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై ప్రత్యేక దృష్టి సారించి గ్రా మాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు.
- జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు
దండేపల్లి మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై ప్రత్యేక దృష్టి సారించి గ్రా మాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు. బుథవారం దండేపల్లితో పాటు రెబ్బనపల్లి గ్రామాలను ఆయన సందర్శించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళి కలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రతిఒక్కరూ భాద్యత తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరి సరాల పరిశుభ్రత అంతే ముఖ్యమన్నారు. గ్రామాల్లోని ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనిపించకుడా చూడాలన్నారు. సెగ్రిగేషన షెడ్‌లలో సేంద్రియ ఎరువుల ఉత్పత్తి జరిగేలా పంచాయతీ కార్యదర్శులు చూడాలని ఆదేశిం చారు. గ్రామాల్లోని సైడ్ డ్రైనేజీలో మురికినీరు, చెత్తచెదారం లేకుండా సిబ్బందితో శుభ్రం చేయించాలన్నారు. వేసవికాలంలో గ్రామాల్లోని తాగు నీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం దండేపల్లిలో సర్పంచ, ఉపసర్పంచ, వార్డు సభ్యు లతో సమావేశం నిర్వహించి గ్రామాల్లో చేపట్టే పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచులు రాజేశ్వర్‌నాయక్, కల్యాణి అశోక్, ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, ఎంపీవో విజయప్రసాద్, ఉపసర్పంచ నవీన, పంచాయతీ కార్యదర్శులు శ్రీలతరెడ్డి, గంగారం, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పం చు బచ్చలి రాములు పేర్కొన్నారు. బుధవారం దుబ్బపల్లి గ్రామంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన ఉన్నచెట్ల కొమ్ములను తొలగించి శుభ్రం చేయించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను, రోడ్లను శుభ్రంగా ఉంచాలన్నారు. అలాగే ఆస్తి , ఇత ర పనులను చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.