రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - May 13 , 2026 | 12:38 AM
రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు.
వేములవాడ రూరల్, మే 12 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌ను మంగళ వారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా స్టేషన్‌లోని రికార్డు లను పరిశీలించారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి చట్టపరంగా నిందితు లకు శిక్షపడేలా చూడాల న్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేసారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీట ర్లపై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తు లపై నిఘాను కఠినతరం చేయాలన్నారు. వారి కద లికలను గమనిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమగ్ర భద్రతను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టా లన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా అధికా రులు గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాల న్నారు. వాహనదారులకు హెల్మెట్, సీటుబెల్టు విని యోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్ధాలు, మైనర్ డ్రైవింగ్‌లపై అవగాహన కల్పించాలన్నారు. రానున్న బక్రీద్ పండుగ సంద ర్భంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని, వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి, జూదం లాంటి అసాం ఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై చల్లా వెంకట్రాజం పోలీసు సిబ్బంది ఉన్నారు.