పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:17 AM
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్ల లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్ల లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శుక్ర వారం సిరిసిల్ల పట్టణం అశోక్‌నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, ఎందరు పిల్లలు ఉన్నారని ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి.. గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల ఎత్తు, బరువు కొలిచిన వివరాలు, ఆన్‌లైన్‌లో అలాగే రిజిస్టర్ నమోదు చేసిన వివరాలు పరిశీలించారు. కేంద్రంలో నిల్వ ఉన్న గుడ్లు, బాలా అమృతం తనిఖీ చేశా రు. పిల్లల ఎత్తు, బరువు కొలిచే యంత్రాల పనితీరు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రోజు వచ్చేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల సేవలు సద్విని యోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.