వెయ్యి కోట్లతో జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:56 AM
జిల్లావ్యాప్తం గా సుమారు రూ. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామ ని, అందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తం గా సుమారు రూ. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామ ని, అందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేముల వాడ మున్సిపల్‌పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయా లని వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మీ కాలనీలోని 4,5వ వార్డుల్లో రూ.45 లక్షలతో సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న సిరి సిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణం, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపించేందుకు ఒక కార్యాచరణ రూపొందించి ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వేము లవాడ నియోజకవర్గంలో గత సంవత్సరం రూ. 800 కోట్లతో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్తాపన చేశారని గుర్తు చేశారు. చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా పట్టణ పరిధిలో సుమారు 45 కుల సంఘాలకు నిధులు మం జూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో గత 54 సంవ త్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. తిప్పాపూర్ మూడవ బ్రిడ్జి నిర్మాణం పనులు, కోరుట్ల బస్టాండు నుంచి చెక్కపల్లి బస్టాండు వరకు రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయని వివ రించారు. గతంలో కేసీఆర్ తన లగ్గం ఇక్కేడే అయ్యిం దని, ఏటా వందల కోట్లు ఇస్తానని ఇచ్చిన మాటలు తప్పి రాజన్న ఆలయ అభివృద్ధిని పక్కన పెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో రూ.150 కోట్లతో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు జరుగుతున్న నేప థ్యంలో భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తే కొందరు భక్తులు వస్తారా.. అని పెదవి విరిచారని, కానీ నేడు లక్షలాది మంది భక్తులు భీమేశ్వర స్వామివారిని దర్శించకునేందుకు వస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం అండగా ఉంటుందని, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అడుగు స్థలం లేని సుమారు 2వేల మంది లబ్ధిదారులను గుర్తించడం జరి గిందని వారికి అడుగు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వివరించారు. గతంలో వేముల వాడ మున్సిపల్ పీఠంపై పని చేసిన వారు పట్టణ అభి వృద్దిని విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టిన ట్లుగా ఒక్కసారి మున్సి పల్‌లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని కోరారు. పట్టణ పరిధిలో ప్రతి వార్డుల్లో ప్రతి వార్డు లో రూ.10 లక్షలకు తక్కు వ కాకుండా నిధులు మం జూరు చేసి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలను చేప ట్టడం జరిగిందని అన్నా రు. వేములవాడ పట్టణం లో పలు అభివృద్ది పను లకు రూ.4కోట్ల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వేములవాడలో దసరా వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహించుకుంటారని, పెద్ద ఎత్తున జమ్మి గద్దె వద్దకు ప్రజలు వస్తారని ప్రజలకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా సీసీ రోడ్లు నిర్మాణం చేపడు తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. మహాలక్ష్మి కాలనీలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా నని హామీచ్చారు. కృష్ణ జలాలపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌లో సేద తీరుతున్నారని ఆరోపిం చారు. రానున్న రోజుల్లో మన ప్రాంత అభివృద్ది కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేష్, నాయకులు బింగి మహేష్, పుల్కం రాజు, సంద్రగిరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.