రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:02 AM
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాడడంతో పాటు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన చర్యలు చేప ట్టాలని ఎస్పీ మహేష్ బీ గితే అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాడడంతో పాటు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన చర్యలు చేప ట్టాలని ఎస్పీ మహేష్ బీ గితే అదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్ శాఖ పనితీరు, శాంతిభధ్రతలకు తీసుకుంటున్న చర్యలు, క్షేత్రస్థాయిలో సాంకే తిక పరిజ్ఞానం వినియోగం, నేరాల నియంత్రణ, గంజాయి, సైబర్ నేరాల నివారణలకు చేపడుతున్న చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ సమీక్షించి చర్చించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నమోదైన ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి కోర్టు ల్లో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలని సూచించారు. పెండింగ్ కేసు లను త్వరగా పరిష్కరించడంతో పాటు సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య, ఐఆర్ ఏడీ, గాండీవ, సహయోగ్, జీఎంఆర్, ఎంఆర్‌ఎం పోర్టల్, జిల్లా మహిళా భద్రతా విభాగం అప్లికేషన్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్ర యాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ వారియర్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్‌ను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజ లతో సత్సంబంధాలు కొనసాగించాలని, పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని తెలిపారు. సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీలో భాగంగా పట్టణాలు, కాలనీలు, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. దొంగతనాల నియం త్రణకు ప్రతి సర్కిల్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరం తర నిఘా కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెం ట్ల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయా లన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులకు సత్వర వైద్య సహా యం అందేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలీస్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో విధులు నిర్వహించాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమర్థవం తమైన పోలీసింగ్‌ను కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.