Share News

గణనాథునికి ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:26 AM

సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన గణనాథునికి సోమవారం ఎస్పీ దంపతు లు ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గణనాథునికి ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన గణనాథునికి సోమవారం ఎస్పీ దంపతు లు ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడు రోజులుగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పూజలు అందుకున్న గణనాఽఽథుని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శోభాయాత్రను పారంభించారు. భక్తి శ్రద్ధలతో గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా చేపట్టాల ని ఎస్పీ మహేష్‌బీగీతే కోరారు. కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారీ, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, సీఐలు, అర్‌ఐలు ఎస్‌ఐలు పాల్గొన్నారు. అలాగే సిరిసిల్ల పట్టణంలోని పలు గణేష్‌ మండపాలను సోమవారం రాత్రి సంద ర్శించి గణపాఽథులకు ప్రత్యేక పూజలు చేశారు. మండపాల వద్ద ఏర్పాట్ల ను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2200 గణేష్‌ మండపాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గణేష్‌ మండపాల నిర్వాహకులు పోలీస్‌ శాఖ సూచించిన నిబంధనలు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ ఘటనలకు తావులే కుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. గణేష్‌ నిమజ్జ నం రోజున డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. టౌన్‌ సీఐ శ్రీని వాస్‌, సిబ్బంది మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 01:26 AM