Share News

దశలవారిగా సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:47 AM

సిరిసిల్ల రైతు బజారులోని సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తాం అని సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్తు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

దశలవారిగా సమస్యల పరిష్కారం

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల రైతు బజారులోని సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తాం అని సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్తు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌ను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి డైరెక్టర్లతో కలిసి పర్యటించారు. రైతు బజా రులో ప్రధాన సమస్యలపై రైతులను, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. రైతుబజార్‌లో మౌలిక సదుపాయాలు, పార్కింగ్‌ సమస్యలు, కూరగాయల విక్ర యాల సమయంలో ఎదురు అవుతున్న సమస్యలను రైతులు, వ్యాపారులు చైర్మ న్‌కు వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ రైతుబజార్‌ పార్కింగ్‌ సమస్యతోపాటు కూరగాయల విక్రయాలు, వినియోగదారుల కొనుగోళ్లకు ఇబ్బం ది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు బజార్‌లో పారిశుధ్యంతో పాటు ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వ సహకారంతో రైతు బజార్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గుగ్గిళ్ళ శ్రీకాంత్‌గౌడ్‌, డైరెక్ట ర్లు ధర్మారెడ్డి హారికచందు, కొత్త రవీందర్‌గౌడ్‌, స్వర్గం రాజు, షేక్‌ ఇక్బాల్‌, ఎలు క తిరుపతి, పయ్యావుల శ్రీకాంత్‌, బోన్ల శ్రీశైలం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 12:47 AM