అభివృద్ధి, సంక్షేమంతో సామాజిక న్యాయం
ABN , Publish Date - Aug 16 , 2026 | 01:45 AM
స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
- పేదల ప్రగతిని ఆకాంక్షించే ప్రభుత్వం మాది
- విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
- ఘనంగా స్వాంత్య్ర దినోత్సవం
కరీంనగర్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులు, త్యాగమూర్తులు, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందామని అన్నారు.. ప్రజాపాలన ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. జిల్లా మహిళలు ఇప్పటి వరకు 366.31 కోట్ల రూపాయల లబ్ధి పొందారని చెప్పారు. 29.78 కోట్ల గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ, 182.3 కోట్ల విద్యుత సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు.
ఫ రూ. 206.82 కోట్ల రైతు భరోసా
ఈ వానాకాలం పంటకు 1,92,628 మంది రైతులకు రైతుభరోసా ద్వారా 206.82 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశామని మంత్రి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. సన్నరకం ధాన్యం బోనస్ 71,17 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మొదటి విడతలో 10,506 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా 8,557 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, గృహ నిర్మాణాన్ని బట్టి దశలవారీగా ప్రభుత్వం 222 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ఇంటి పైకప్పు మార్చుకునేందుకు నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకుం ప్రతి గృహానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు.
ఫ 47,138 కొత్త రేషనకార్డులు
అర్హులందరికీ కొత్త పింఛన్లు అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. 47,138 కొత్త రేషన కార్డులను మంజూరు చేయడంతోపాటు కొత్తగా 97,013 మంది కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేశామని, మొత్తం జిల్లాలో 3,22,198 కుటుంబాలకు గాను ప్రతి నెలా 6,063 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రేషన దుకాణాల ద్వారా పంపిణీ చేశామన్నారు. రేషన కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందించే ప్రక్రియను ప్రారంభించామని, రేషన కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, పైవ్రేట్ ఆసుపత్రుల్లో ఈ సంవత్సరం 14,932 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించామన్నారు. ఇందుకు 42.75 కోట్లు ప్రభుత్వం నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 374మహిళా సంఘాలకు స్వంత భవనాలు నిర్మించేందుకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు.
ఫ ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో 4,290 పెండింగ్ ఫైళ్ల పరిష్కారం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో 4,290 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించారని మంత్రి అడ్లూరి తెలిపారు. అన్ని గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించామన్నారు. చొప్పదండి మండలం కోనేరుపల్లి, రామడుగు మండలం వెలిచాల గ్రామాలు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయని తెలిపారు. ప్రజలకు దూర భారాన్ని తగ్గించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందన్నారు. జిల్లాలోని ఏడు గ్రామాల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి భూభారతి రీ సర్వే నిర్వహిస్తున్నామని వివరించారు.
ఫ ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలైన పప్పు దినుసులు, నూనె గింజలు, తృణ ధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. వీబీ జీరామ్‌జీ పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 51,517 కుటుంబాలకు 17 లక్షల పని దినాలు కల్పించామన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి, విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించే హరేరామ.. హరేకృష్ణ ఫౌండేషనకు జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్ యార్డులో సెంట్రలైజ్డ్ కిచెన ఏర్పాటుకు స్థలం కేటాయించామన్నారు. 5,351 మంది మహిళలను ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ శిక్షణలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలవడం విశేషమని చెప్పారు. ఎస్సీ, స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటివరకు 238 మంది ఉద్యోగాలు సాధించారన్నారు. జిల్లాలో 777 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 7,579 మంది గర్భిణులు, బాలింతలకు, 42,909మంది పిల్లలకు బలవర్ధక, పోషకాహారం అందిస్తున్నామని వివరించారు. జిల్లాలో 60 అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన జారీ చేశామని చెప్పారు..
ఫ కరీంనగర్ అభివృద్ధికి కృషి
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన పరిధిలో 840 కోట్ల యూసీఎఫ్, 50 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టడడం జరిగింది. 158 కోట్ల మున్సిపల్ సాధారణ నిధులతో నగరంలో సీసీ రోడ్లు, డ్రైన, మంచినీటి పైప్‌లైన వంటి పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనగణనలో భాగంగా మొదటి దశలో మే 11 నుంచి జూన 9వరకు ఇండ్ల జాబితా సేకరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో జనగణన చేపట్టనున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సీపీ గౌస్ ఆలం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన సత్తు మల్లేశం, మున్నూరుకాపు కార్పొరేషన బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సుడా మాజీ చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీ వాఖడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిల పాల్గొన్నారు.