Share News

సజావుగా నామినేషన్ల స్వీకరణ

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:52 AM

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

సజావుగా నామినేషన్ల స్వీకరణ

సిరిసిల్ల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో గురు వారం సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ముందుగా నామినేషన్‌ కేంద్రాల్లో ఓటర్‌ జాబితా, రిజర్వేషన్‌ జాబితా, నో డ్యూస్‌ సర్టిఫికెట్‌, హెల్ప డెస్క్‌, అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమా వళి ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ జరపాలని అధికారులకు ఆదేశిం చారు. నామినేషన్‌ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కుల ధ్రువీక రణ పత్రాల మంజూరులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిరిసిల్ల తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈనెల 30వ తేదీ వరకు ఉదయం 10.30 గం టల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. సిరిసిల్లలో 39 వార్డులకు సంబంధించి.. 13మంది ఆర్‌వోలు, 13మంది ఏఆర్‌వోలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశా లకు అనుగుణంగా నియమించామని తెలిపారు. ఎస్‌ఎస్టీ, ఎఫ్‌ఎస్టీ బృందా లను నియమించామన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడిం చారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా, డీఈఓ జగన్‌ మోహన్‌ రెడ్డి, తహసీల్దార్‌ మహేష్‌ కుమార్‌, మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:52 AM