సజావుగా ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:55 PM
జిల్లాలో ధాన్యం కొనుగో ళ్లు సజావు చేపట్టేందుకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వస తులను కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, అక్టో బరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగో ళ్లు సజావు చేపట్టేందుకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వస తులను కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై సింగిల్ విం డో కార్యదర్శులు, ఐకేపీ, మెప్మా కేంద్రాల నిర్వ హకులు, వ్యవసాయ శాఖ అధికారులు, ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాలు కు రూ.2461, సాధారణ రకానికి రూ.2441 మద్దతు ధర ఉందని వెల్లడించారు. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15408, హెచ్ఎంటీ సోన, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, కేఎన్ఎం7715, డబ్ల్యూ జీఎల్ 44సన్నవడ్ల రకాలకు ప్రభుత్వం క్వింటా లుకు అదనంగా రూ.500 ఇస్తుందని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచిం చారు. అన్ని కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్లు, తాగునీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పా లిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం17 ఉండేలా చూసుకుని కేంద్రాలకు తరలించాలని సూచించారు.నిబంధనల మేరకు రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. రైతులకు టోకెన్లు ఇవ్వాలని, దాని ప్రకారం కొనుగోళ్లు చేయాలని సూచించారు. ఈసారి ధాన్యం తర లించే అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుందని తెలిపారు. దీంతో వాహనా లు ఎక్కడ ఉన్నా తెలుసుకోవచ్చని స్పష్టం చేశా రు. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు సజా వుగా పూర్తి చేసేందుకు సహకరించిన ఆయా శాఖల అధికారులు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో రైతులకు ఉత్తమ సేవలందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, పౌర సరఫరాల శాఖ మేనేజర్ గోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి అఫ్జల్ బేగం, సహకార అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.