Share News

ఆరు గ్యారంటీలు అమలు చేయాలి

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:05 AM

ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట దర్నా చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర నాయకులు

సుభాష్‌నగర్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. నేడు 1000 రోజులు గడిచినా హామీ నిలుపుకోవడం లేదన్నారు. మహిళలకు ప్రతి నెలారూ. 2,500 , రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ను ఎగ్గొట్టిందన్నారు. రైతు భరోసాుకు భరోసా లేకుండా పోయిందన్నారు. యువ వికాస పథకాన్ని గాలికి వదిలేసిం దన్నారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు , ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు పత్తా లేకుండా పోయిందన్నారు. పెన్షన్లను పెంచుతామని మోసం చేసిందన్నారు. ఉచిత విద్యుత్‌ అందించే స్కీంను తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, వై. సునీల్‌ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్‌, ఈ. నాగేశ్వర్‌ రెడ్డి, వాసాల రమేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌ , జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, కల్లెం వాసుదేవరెడ్డి, రంగు భాస్కరాచారి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, ఎస్సీమోర్చాజిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:05 AM