Share News

ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:13 AM

కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతపార్టీ జోన్‌ నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం కరీంనగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి

భగత్‌నగర్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతపార్టీ జోన్‌ నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం కరీంనగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ వెయ్యి రోజులు దాటినా అమలు చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జోన్‌ అధ్యక్షుడుు జాడి బాల్‌రెడ్డి, తణుకు సాయికృష్ణ, పాదం శివరాజ్‌, బండారి గాయత్రి, అవదుర్తి శ్రీనివాస్‌, గుజ్జ శ్రీనివాస్‌, కార్పోరేటర్లు బండ రమణారెడ్డి, ఒంటెల సత్యనారాయణరెడ్డి, సోమిడి వేణు, మేకల వెంకటేష్‌, మాసం గణేష్‌, వరాల జ్యోతి, బండి ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 01:13 AM