Share News

కేసీఆర్‌పై సిట్‌ విచారణ కక్ష సాధింపు చర్య

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:38 AM

మాజీ ముఖ్య మంత్రి, భారత రాష్ట్ర సమితి అధి నేత కేసీఆర్‌ను సిట్‌ విచారణకు పిలవడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని బీఆర్‌ఎస్‌ జిల్లాఅధ్యక్షు డు కల్వకుంట్ల విద్యా సాగర్‌ రావు అన్నారు.

కేసీఆర్‌పై సిట్‌ విచారణ కక్ష సాధింపు చర్య
మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు

-నేడు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం

-బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌ రావు

జగిత్యాల టౌన్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్య మంత్రి, భారత రాష్ట్ర సమితి అధి నేత కేసీఆర్‌ను సిట్‌ విచారణకు పిలవడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని బీఆర్‌ఎస్‌ జిల్లాఅధ్యక్షు డు కల్వకుంట్ల విద్యా సాగర్‌ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్సీ ఎల్‌. రమణ నివా సంలో శనివారం రాత్రి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మడ్డిపడ్డారు. ఆదివారం జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామ గ్రా మాన పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేప ట్టాలని బీఆర్‌ఎస్‌ నాయకులకు, కార్యకర్తలకు పిలు పు నిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, దావ సురేష్‌, హరిచరణ్‌ రావు, గంగరెడ్డి, అవారి శి వకేసరి బాబు, దేవేందర్‌ నాయక్‌, అయిల్నేని సాగ ర్‌రావు, వొల్లెం మల్లేశం, ఆనంద్‌రావు పాలొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 12:38 AM