Share News

రెడ్‌ జోన్‌లో సిరిసిల్ల..

ABN , Publish Date - May 20 , 2026 | 12:17 AM

భగ్గుమన్న ఎండతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

రెడ్‌ జోన్‌లో సిరిసిల్ల..

సిరిసిల్ల, మే 19 (ఆంధ్రజ్యోతి) : భగ్గుమన్న ఎండతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45.6 డిగ్రీలు దాటిపోయిం ది. సోమవారం ఉదయం 8గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూప డం మొదలుపెట్టాడు. సాయంత్రం 7గంటలు దాటినా వడగాలులతో బయటకు ప్రజలు రాలేని పరిస్థితి కనిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు చందుర్తి, కోనరావుపేట మండలాలు రెడ్‌అలర్ట్‌ జోన్‌ ఉష్ణోగ్రతల నమోదయ్యా యి. మిగతా మండలాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సిరిసిల్లలో గరిష్ఠ ఉష్ణో గ్రతలు 45.6 డిగ్రీ ఉండగా, చందుర్తిలో 45.5 డిగ్రీలు. కోనరావుపేటలో 45.2 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలుగా నమోదయ్యాయి మూడు మండలాలు రెడ్‌ అలర్ట్‌గా ఉండగా మిగతా మండలాలు ఆరెంజ్‌ అలర్ట్‌గా ఉన్నాయి. వేములవాడ రూరల్‌లో 44.9 డిగ్రీలు, రుద్రంగిలో 44.7డిగ్రీలు, బోయిన్‌పల్లిలో44.6 డిగ్రీలు, ముస్తాబాద్‌లో 44.6 డిగ్రీలు, వేములవాడలో 44.5డిగ్రీలు, తంగళ్ళపల్లిలో 44.4 డిగ్రీలు, ఎల్లారెడ్డిపేటలో 44.2 డిగ్రీలు, గంభీరావుపేటలో 44.0 డిగ్రీలు, వీర్నపల్లి లో 43.9 డిగ్రీలు, ఇల్లంతకుంటలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 20 , 2026 | 12:18 AM