సిరిసిల్ల బల్దియా అంచనా బడ్జెట్ రూ.57.21కోట్లు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:16 AM
సిరిసిల్ల బల్దియ బడ్జెట్‌పై నూతన కౌన్సిల్ ఎంతో ఉత్సాహంగా చర్చలు జరిపింది.
సిరిసిల్ల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల బల్దియ బడ్జెట్‌పై నూతన కౌన్సిల్ ఎంతో ఉత్సాహంగా చర్చలు జరిపింది. 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర నిధులు కలుపుకొని సిరిసిల్ల మున్సిపల్‌కు సంబంధించి 2026- 27 వార్షిక అంచనా బడ్జెట్ రూ 57.21 కోట్లను ఆమోదించారు. కౌన్సిలర్లు వివిధ పద్దులపై చర్చలు జరిపారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం సమావేశం మందిరంలో చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన సిరిసిల్ల మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ గరీమ అగ్రవాల్ బడ్జెట్ సమా వేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. కౌన్సిల్‌కు పలు సూచనలు చేశారు. బడ్జెట్‌లో 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ఇతర నిధులు 40.20కోట్లు వస్తాయని అంచనా వేశారు. మున్సిపల్‌కు వచ్చే ఆస్తి పన్ను లు, నీటి పన్నులు, అద్దెలు, ఇతర పన్నులు రూ 16.85 కోట్లు కలుపుకొని రూపొందించిన బడ్జెట్ రూ.57.21 కోట్లను కౌన్సిల్ ఆమోదించింది. బడ్జెట్‌లో సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు, మురికివాడల అభివృద్ధి కోసం రూ.35 లక్షలు పొందపరిచారు, గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించారు. అనంతరం 21అంశాలతో సాధారణ సమావేశం నిర్వహించారు. సిరిసిల్లలో మురికి కాలువలో మట్టి తొలగించడం పనులకు రూ.30 లక్షలు మంజూరు చేశారు. మంచినీటి సరఫరా నిర్వహణ, పైప్ లైన్, ఇతర అవసరాల కోసం రూ.32.50 లక్షలు మంజూరు చేశారు. మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల్లో వార్డుకు రూ.3లక్షల చొప్పున మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం జనరల్ నిధుల నుంచి రూ.1.17కోట్లు కేటాయించారు. సిరిసిల్లలోని రగుడు జంక్షన్ అభివృద్ధి కోసం రూ 15 లక్షలు మంజూరు చేశారు. సిరిసిల్లలో ఇందిరా పార్క్,ఓపెన్ జిమ్ రిపేర్ల కోసం రూ.10లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా మంచినీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఏర్పడ కుండా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుం డా ముందస్తుగా మురికి కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం, పట్టణంలోని ప్రజల మౌలిక అవసరాలను తీర్చే విధంగా 21 అంశాలతో ప్రవేశపెట్టిన ఎ జెండాను సభ్యులు ఏకగ్రీవ ఆమోదించారని తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖదీర్ ఫాష, తహసీల్దార్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధిక ారులు పాల్గొన్నారు.
ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి..
సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. అందరి సహకారంతో ఇటీవల ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామని, నూతన సభ్యులందరికీ అభి నందనలు తెలియజేశారు. బడ్జెట్ మీటింగ్ చాలా కీలకమని, రెవెన్యూ వ్య యంలో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు,కరెంట్ బిల్లులు, రుణా ల చెల్లింపు, పారిశుధ్య పనులకు చెల్లింపులు, ఇతర ఖర్చులు ఉంటాయని, తప్పనిసరిగా 10 శాతం గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. మున్సిపల్‌కు రావాల్సిన పన్నులు వంద శాతం వసూలు చేయడంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తే 15వ ఆర్థిక సంఘం నిధు లు మంజూరు అవుతాయని వెల్లడించారు. మున్సిపల్ కౌన్సిలర్లు తమ పరిధిలో ఇంటి, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేసేందుకు సహకరించాలని, అన్ని షాప్‌లు లైసెన్స్ తీసుకునేలా చూడాలని సూచిం చారు. మున్సిపాలిటీకి చెందిన ఖాళీగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ గదులు అద్దెకు ఇచ్చేందుకు మరోసారి టెండర్లు పిలువాలని ఆదేశించారు. ప్రతి రోజు పారిశుధ్య పనులు పక్కాగా చేయించాలని, తడి, పొడి చెత్త వేరు వేరుగా ఇచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. పార్క్‌లు, వైకుంఠ ధామాలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ పక్కాగా ఉండాలని స్పష్టం చేశా రు. కొత్త చెరువులో మరమ్మతు పనులు వేగంగా చేయించాలని, ప్రజలు, పిల్లలు వచ్చేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. డీఆర్‌సీసీ కేంద్రం పక్కాగా నిర్వహించాలని, ఏబీసీ కేంద్రం వినియోగం లోకి తీసుకురావాలని సూచించారు. సిరిసిల్ల ఖ్యాతి చాటేలా రగుడు జంక్ష న్ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, త్వరలోనే వినియోగంలోకి రానున్న దని వెల్లడించారు. అమృత్ పథకం కింద తాగునీటి సమస్యకు పరిష్కారం కానున్నదని వివరించారు. తాగునీటి సమస్య రాకుండా కౌన్సిలర్లు, అధికా రులు చూసుకోవాలని తెలిపారు.