సర్ ప్రక్రియను నిలిపివేయాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:08 AM
సర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా మంగళవారం నిర్వహించారు.
గణేశ్‌నగర్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా మంగళవారం నిర్వహించారు. మోదీ, అమిత్‌షా, జ్ఞానేష్‌కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను తక్షణమే తొలగించి, ఆయనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ సీఈసీని తొలగించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌బాబు, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు జోజిరెడ్డి, హుజూరాబాద్ మునిసిపల్ చైర్మన్ సుహాసిని, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఎండీ తాజ్, ముత్యం శంకర్‌గౌడ్, సతీష్‌యాదవ్, బానోతు శ్రావణ్ నాయక్, ఫహాద్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్, నాగెల్లి లక్ష్మారెడ్డి, గూడెం లక్ష్మి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు బండ రాజిరెడ్డి, గోవిందుల రవి, చొక్కల్ల శ్రీశైలం, ఉమ్మెంతల రవీందర్‌రెడ్డి, గజ్జి అయిలయ్య, పైడిపల్లి రాజు, చాడ శ్రీధర్‌రెడ్డి, అందె చిన్నస్వామి, కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, మచ్చ రమేష్, బామండ్లపల్లి యుగంధర్, నలువాల సదానందం, కాంతాల అంజిరెడ్డి, కొట్టె అంజలి, బోయిని వల్లభాయ్‌పటేల్, తేరాల సత్యనారాయణ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు నునావత్ శ్రీనివాస్, పోలోజు రంజిత్ పాల్గొన్నారు.