ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - May 17 , 2026 | 12:28 AM
ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శ కంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల, మే 16 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శ కంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరా బాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్ని కల నమోదు అధికారులు, సంబంధిత అధికారులతో ఎస్‌ఐఆర్ కార్య క్రమం, మ్యాపింగ్ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారులు తమ బృందాలను సమన్వయం చేసుకుని మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించిన ఎస్‌ఐఆర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి 24 వరకు సన్నాహక చర్యలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కాలంలో బీఎల్‌వోలు, ఎన్నికల సిబ్బందికి ఎస్‌ఐఆర్‌పై పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. .ప్రతి బీఎల్‌వోకు ఎస్‌ఐఆర్ నిబంధనలు, విధివిధానాలు, ఫీల్డ్ వెరిఫి కేషన్ విధానం, ఫారాల నిర్వహణపై పూర్తి అవగాహన, పట్టు ఉండేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ కోసం అవస రమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 24 నుంచి జూలై 25 వరకు బూత్ లెవల్ అధికా రులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తిస్థాయిలో ధ్రువీకరించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి అర్హత ఓటరిని గుర్తించి జాబితాలో చేర్చాలని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. జూలై 31న ముసా యిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, కొత్త క్లెయిమ్‌లు, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాత్రమే నిర్ణ యం తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుపై ఫీల్డ్‌స్థాయిలో విచారణ నిర్వహించాలని, ఎటువంటి ఫిర్యాదును నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయి మ్‌ల స్వీకరణ జరుగుతుందని, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.ప్రజలకు తమ ప్రాంతం లోని బీఎల్‌ఓ ఎవరో తెలిసేలా, వారి పేరు, మొబైల్ నంబర్, పోలింగ్ కేంద్రం వివరాల గురించి చర్యలు తీసుకోవాలని, విస్తృత ప్రచారం చేప ట్టాలన్నారు. ఫారం 6,7,8 ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, మరణించిన ఓటర్ల వివరాలను ధ్రువీకరించి, తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ, సమావేశాల మినిట్స్‌ను భద్రపరచాలని సూచించారు. అలాగే ఐటీ బృందానికి ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని, బీఎల్‌వోలు మొబైల్ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఒకే కుటుంబ సభ్యులపేర్లు ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెల్స్‌లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాజేందర్‌రెడ్డి, కేఎస్‌బీ కుమారి, సిరిసిల్ల, వేము లవాడ తహసీల్దార్లు మహేష్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీ ణ్, రెహమాన్ పాల్గొన్నారు.