ప్రణాళిక ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియ
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:27 AM
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.
సిరిసిల్ల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), అనామలీస్, నో మ్యాపిం గ్ ఓటర్లకు నోటీసుల జారీ, తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసి ల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి కలె క్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. జిల్లాల వారీగా అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కింద అన్ని జిల్లాల్లో అనామలీస్, నోమ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు డౌన్లోడ్ చేసి ఓటర్లకు అందజేయాలని ఆదేశించారు. నోటీసులో ఓటర్ సమాధానం అందించేందుకు తేదీ, సమయం, స్థలం వివరాలు ఇవ్వాలని సూచిం చారు. ఒక కుటుంబం ఓట్లు అన్ని అదే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఫారం 6,7,8 దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. ఏఎస్‌డీడీ జాబితాను మరోసారి తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. జిల్లాల్లో చేపడుతున్న చర్యలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, రాష్ట్ర స్థాయికి పంపాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సులభంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు. నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యం తరాల పరిష్కారం వంటి ప్రతి దశను అధికారులు సమన్వయంతో పర్యవేక్షిస్తూ, నిర్ణీత కాలపరిమితిలో ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
నోటీసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు..
- కలెక్టర్ గరిమ అగ్రవాల్
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కింద జిల్లాలో 5008 నో మ్యాపింగ్ ఓటర్లు, 78833 అనామలీస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసేం దుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. ఆర్డీవోలు తమ పరిధిలోని బీఎల్‌ఓలకు నోటీసులు జారీ తదితర అంశా లపై శిక్షణనివ్వాలని ఇప్పటికే తెలియజేశామన్నారు.ఒక షెడ్యూల్ సిద్ధం చేసి, దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. ఎన్నిక ల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ పకడ్బందీగా పూర్తిచేస్తా మని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్ బీ కుమారి, కలెక్టరేట్ పర్యవేక్షకుడు ప్రవీణ్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్, మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.