ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం
ABN , Publish Date - May 11 , 2026 | 11:46 PM
నిజమైన ఓటర్ హక్కును కొల్పోకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, మే 11 (ఆంధ్రజ్యోతి) : నిజమైన ఓటర్ హక్కును కొల్పోకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను అదేశించారు. ప్రత్యేక సమగ్ర సవర ణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితా 2002 ఎస్‌ఐ ఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఎస్‌ఐ ఆర్ మ్యాపింగ్ పురోగతిని కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రాబోయే 15 రోజుల్లో కనీసం 90 శాతం మ్యాపింగ్ పూర్తిచేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికా రులు తమ బృందాలను ప్రోత్సహించి మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ కోసం అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను అన్ని వనరుల నుంచి గుర్తించి నియమించుకోవాలని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రారంభమైన తర్వాత ప్రతిరోజూ ఫారాల పంపిణీ, సేకరణపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు తమ ప్రాంతం లోని బీఎల్‌వో ఎవరో తెలిసేలా చర్యలు తీసుకోవాలని, ఏ నిజమైన ఓట రు తన ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ఆదేశించారు. మ్యాపింగ్ పురోగతిని పెంచేందుకు ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావే శాలు నిర్వహించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహి ళల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.