Share News

గడువులోగా ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ పూర్తి..

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:49 AM

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

గడువులోగా ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ పూర్తి..

సిరిసిల్ల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధ వారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ పురోగతి ని జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో నమోదై ఉంటే, వారిని సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గ దర్శకాల మేరకు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను గడువు లోగా పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని, కచ్చితమైన ఓటరు జాబితాల తయారీలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియ 86.09 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వేములవాడ ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, ప్రొబేషనరీ డిప్యూ టీ కలెక్టర్‌ నిఖిత, తహసీల్దార్లు మహేష్‌, జయంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:49 AM