అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా ఎస్‌ఐఆర్ పూర్తి
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:59 PM
అర్హు లైన ఏ ఒక్క ఓటరూ ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బం దీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీల కులు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : అర్హు లైన ఏ ఒక్క ఓటరూ ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బం దీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీల కులు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అదనపు కలెక్టర గడ్డం నగేష్‌తో కలిసి అధికారులతో పరిశీలకులు సమీక్షించారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో జిల్లాలో సమావేశాలను నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మొత్తం ఎస్‌ఐ ఆర్ డిజిటలైజేషన్ 87.68 శాతం పూర్తి చేశామని అధి కారులు వెల్లడించారు. ఫారం 6,7,8 కింద మొత్తం 65,517 దరఖాస్తులు రాగా అందులో 61,475 పరిష్కరిం చామని మిగతావి పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడు తూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని పేర్కొన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటు హక్కు పునాది వంటిదన్నారు. ఓటు హక్కు దుర్వినియో గాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కును కోల్పోకుండా చూడటం అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్, అధి కారులు, సహకరిస్తున్న రాజకీయ పార్టీల ప్రతినిధులను అభినందించారు. మిగిలి ఉన్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని సూచిం చారు. బీఎల్‌వోలు తప్పనిసరిగా ఓటర్ల ఇళ్లకు స్వయం గా వెళ్లి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని ఆదేశిం చారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లకు సం బంధించిన కారణాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య లు తలెత్తకుండా రికార్డులు పక్కాగా నిర్వహించాల న్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అందే ఫిర్యా దులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసు కోవాలని సూచించారు. ఇందుకోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకునేలా ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై స్వీప్ కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. అధికారులు మరింత బాధ్య తతో పనిచేసి జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశిం చారు. ఏఎస్‌డీడీ జాబితా మరోసారి పరిశీ లించాలని ఆదేశించారు. సమీక్ష అనంతరం రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు, అద నపు కలెక్టర్‌తో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. హెల్ప్ డెస్క్‌లో సిబ్బంది, ఫిర్యాదుల నమోదు, పరిష్కారంపై ఆరా తీశారు. అలాగే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు 121, 131లో రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు, అదనపు కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీఎల్‌వో లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్‌బీ కుమారి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, ఏఈఆర్‌ఓలు, కలెక్టరేట్ పర్యవే క్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.