Share News

మంత్రుల వరాల జల్లు

ABN , Publish Date - Jan 12 , 2026 | 02:45 AM

రామగుండం పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు వరాలు కురిపించారు.

మంత్రుల వరాల జల్లు

గోదావరిఖని, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రామగుండం పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు వరాలు కురిపించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ అధ్యక్షతన ఆదివారం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవె న్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పరి శ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, అటవీశాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడారు. రాష్ట్రం వస్తే సంపద ఉంటుందని ప్రజలు నమ్మారని, కానీ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క ప్రాజెక్టు తీసు కురాలేకపోయారన్నారు. ప్రాజెక్టులతోనే జీవన స్థితిగతులు మెరుగవుతాయని, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌ సీఎల్‌, సింగరేణి, ఎల్లంపల్లి ప్రాజెక్టు వంటివి కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 800మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి కేబినెట్‌ మంజూరు చేసిందని, త్వరలోనే ప్రకటన చేసి శంకుస్థాపన చేస్తామన్నారు. అలాగే పాలకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను కూడా మంజూరు చేస్తామన్నారు. పట్టణ ప్రాంతా ల్లో ఒకే తహసీల్దార్‌ కార్యాలయం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రామగుండంలో మరో తహ సీల్దార్‌ కార్యాలయాన్ని మంజూరు చేస్తామన్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలోనే రామగుండంలో ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని, దాన్ని బీఆర్‌ఎస్‌ ముందుకు తీసుకెళ్లలేకపోయిందన్నారు.

ఫ 76జీఓ ద్వారా మరో 11వేల మందికి పట్టాలు

పెండింగ్‌లో ఉన్న జీఓ 76 ప్రకారం కోల్‌బెల్ట్‌లోని అన్ని ఏరియాల్లో పట్టాలు ఇచ్చేందుకు త్వరలోనే కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటామని, సింగరేణి ప్రాం త పట్టణాలు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి సీఎస్‌ ఆర్‌, డీఎంఎఫ్‌టీ నిధులు వెచ్చిస్తామన్నారు. త్వర లోనే కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేస్తామన్నా రు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ నిత్యం ప్ర జల గురించి ఆలోచించే వ్యక్తి అని, పట్టువదలని విక్రమార్కుడిలా వెంటపడి నిధులు తీసుకువస్తు న్నారన్నారు. నియోజకవర్గంలో రూ.600కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రామ గుండంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ లబ్దిదారులకు 693ఇండ్లు పూర్తి చేసి ఇస్తున్నామని, అలాగే మరో 300అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇం డ్లకు లబ్దిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ పథ కంలో పూర్తి చేస్తామన్నారు. 586మంది నిరుపే దలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడ నిజంగా గొప్ప విషయమన్నారు. మొత్తంగా 1717మంది లబ్దిదారు లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తున్నా మన్నారు. రామగుండాన్ని వాణిజ్య, వ్యాపార కేం ద్రంగా, వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని, హైదరాబాద్‌ స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆలో

(మిగతా 6వ పేజీలో)

Updated Date - Jan 12 , 2026 | 02:45 AM