బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:37 AM
బీఆర్ ఎస్ ప్రభుత్వ మూర్ఖపు పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
వేములవాడ రూరల్, జూన్ 14(ఆంధ్రజ్యోతి) : బీఆర్ ఎస్ ప్రభుత్వ మూర్ఖపు పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. బొల్లారం గ్రామంలో వేములవాడ- నిజామాబాద్ జిల్లా సిరికొండ వరకు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 23 కోట్ల రూపాయలతో 18.21 కిలోమీటర్ల మేర నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేసారు. ఈ సంద ర్భంగా ఎంపీ బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ గడి చిన 7సంవ్సతరాల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 22వేలకోట్ల నిధులను కేంద్రం నుంచి తీసు కువచ్చామన్నారు. కేవలం రోడ్ల అభివృద్ధి కోసమే 10వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కేవలం జాతీయ రహదా రుల విస్తరణ కోసమే 5వేల కోట్లు తీసు కొచ్చామన్నారు. సీఆర్‌ఐఎఫ్, జాతీయ ఉపాధిహామీ పథకం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా గ్రామాల్లో రహాదారుల నిర్మాణాలను చేపడుతున్నాం. గ్రామాల నుంచి మండ లాలు, నియోజకవర్గలను కలిపేవిధంగా కనెక్ట్ రోడ్డులను నిర్మిస్తున్నాం. 6నెలల్లో ఈ రోజు శంకుస్థాపన చేసిన వేముల వాడ- సిరికొండ డబుల్‌రోడ్డు పనులు పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. ఇటీ వల చొప్పదండి మండలం అర్నరొండ గ్రామం నుంచి గోపాల్‌రావు మీదుగా మల్యాల వరకు 50కోట్ల రూపాయల వ్యయంతో 35 కిలోమీటర్ల మేర డబుల్‌రోడ్డు పనులను ప్రారంభించామన్నారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహ దారిని 2147కోట్ల రూపాయలతో, 578 కోట్ల రూపాయలతో ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి పనులు శరవేగం గా జరుగుతున్నాయన్నారు. కరీంగనర్-జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు కేంద్రం ఈమోదం తెలిపిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయించుకుంటూ పనిచేస్తే నే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత బీఆర్‌ఎస్ పాల నలో ఇది సాధ్యంకాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సహ కరిస్తున్నందున రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నా యన్నారు. స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ వేముల వాడ నియోజక అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. ఎన్నిక ల సమయంలోనే రాజకీయాలు చేయాలని ఎన్నికల అనం తరం అభివృధ్దికోసం పనిచేయాలన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం తీసుకుంటాం
రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా కేంద్ర పభుత్వ సాయం తీసుకుంటామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి బేషజాలు లేవని, రహదారుల అభివృద్ధికి కేంద్ర మంత్రులను సైతం ముఖ్యమంత్రి కలిశారని గుర్తుచేశారు. వేములవాడ రాజ న్న ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఈ క్రమంలో ఆలయ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సలహాలను సైతం తీసుకున్నామన్నారు. వేములవాడ నలుదిక్కులా రహదారలను అబివృద్ధి చేసేందుకు కేంద్రం ద్వారా నిధు లను కేటాయింపజేసేలా సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సండెసారి సౌజన్యమల్లికార్జున్, జంకె మధు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మెన్ రొండి రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాపరామకృష్ణ, ఎర్రం మహేష్ నాయకులు కుమ్మరి శంకర్, గోపు బాలరాజు, బండ మల్లేశం, రాపెల్లి శ్రీధర్, పరమేష్, జక్కుల తిరుపతి, తోటశేఖర్ తదితరులు పాల్గొన్నారు.