మానవీయ కోణంలో సేవలందించాలి
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:12 AM
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభ్యున్నతికి అధికారులు చర్యలు తీసుకోవాలని, మానవీయ కోణంలో సేవలు అందించా లని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభ్యున్నతికి అధికారులు చర్యలు తీసుకోవాలని, మానవీయ కోణంలో సేవలు అందించా లని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, కమిష న్ సభ్యుడు రాంబాబు నాయక్‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పథకాల అమలు, సంక్షేమం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న పథకాలు, సంక్షేమం, అట్రా సిటీ కేసుల పరిష్కారం గురించి వివరాలను అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, కులాం తర వివాహాల ఆర్థిక చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, జాబ్ కార్డు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న పని వివరా లపై సమీక్షించారు. ఇప్పటివరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు ఛార్జ్‌షీట్ దాఖలు వివరాలు తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన కేసుల దర్యాప్తు త్వరగా,పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారం అందేవిధంగా చూడాలని వివరించారు. ప్రతినెలా చివరి వారంలో మండలాల్లో సివిల్ రైటర్స్ డే నిర్వహించాలన్నారు. సం బంధిత శాఖల అధికారులు అందరూ సమావేశాల్లో పా ల్గొని, ప్రజల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలుపరుస్తు న్న పథకాలు, చట్టాల గురించి అవగాహన కల్పించాలని వివరించారు. ప్రజలకు మానవీయ కోణంలో సేవలు అందించాలని సూచించారు. కచ్చితంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిట రింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఏవైనా అభివృద్ధికి సంబంధించి నిధులు పెండింగ్ ఉం టే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి విడుదల అయ్యేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల అభ్యున్న తితో పాటు, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా మరింత కృషి చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధి కారులు అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిం చాలని ఆదేశించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ సేవలను చైర్మన్ అభినందించారు. ఎస్సీ, ఎస్టీలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. పోలీసు లు,ఇతర శాఖల అధికారుల సేవలను అభినందించారు.
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం
- కలెక్టర్ గరిమ అగ్రవాల్
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు క్షేత్రస్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకుం టున్నామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రతి పాఠశాల, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ, ప్రతి రోజూ కామన్ మెనూ అమలు చేస్తూ విద్యా బోధన సాగుతోందన్నారు. అన్ని విద్యాలయాల్లో ప్రత్యేక అధికారులను నియమించి తని ఖీ చేయిస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా చూ స్తున్నామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులంద రికీ ఉపకార వేతనాలు, కులాంతర వివాహాల ఆర్థిక సహకారం, అంబేద్కర్ ఓవర్సీస్ ఆర్థిక సహాయం అంది స్తున్నట్లు వివరించారు. ఎస్పీ మహేశ్ బి గితె మాట్లాడు తూ జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్‌వో జయశ్రీ, వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, డీఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్సీ సంక్షేమ శాఖ అధి కారి రవీందర్‌రెడ్డి, సీపీవో శ్రీనివాసాచారి, జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి సంగీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సం క్షేమ అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కాగా, నేరెళ్ల సంఘటనపై నివేదికను కలెక్టర్ ద్వారా తీసుకొని ముఖ్యమంత్రికి అందించి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చేస్తామని చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు.