ఆరుతడి పంటలను సాగు చేయాలి
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:37 AM
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌బేగం అన్నారు.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌బేగం అన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాల్లో శనివారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్లారెడ్డిపేటలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌బేగం మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో తక్కువ నీటితో పండే పంటలను వేసుకోవాలని అన్నారు. కంది, పెసర, నువ్వులు, రాగులు, ఆయిల్ పామ్, తదితర పంటలను సాగు చేసి దిగుబడులను పొందాలని అన్నారు. అనంతరం ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి, వీర్నపల్లి గ్రామాల్లో జలసిరిలో భాగంగా వీబీజీ రామ్ జీ పథకం కింద ఇంకుడు గుంత, బోరు వెల్ రీచార్జి ఫిట్‌లకు భూమి పూజ చేశారు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు సబేరాబేగం, రాములునాయక్, ఎంపీడీవో సత్తయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నర్సయ్య, సర్పంచులు నర్సింలు, రమేశ్, జ్యోత్స్నఅరుణ్‌కుమార్, వార్డు సభ్యులు, ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.