కట్టుశిక్షణతో స్వయంఉపాధి..
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:22 AM
కుట్టు శిక్షణను సద్వినియో గం చేసుకుని మహిళలు స్వయం ఉపాధి పోందాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
తంగళ్లపల్లి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కుట్టు శిక్షణను సద్వినియో గం చేసుకుని మహిళలు స్వయం ఉపాధి పోందాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. శనివారం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి టెక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ, స్కూల్ యూనిఫాం క్లాత్ తయారీ యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణ పొందుతున్న మహిళ లతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు..? ఎన్ని రోజులుగా శిక్షణ పొందుతున్నారు తదితర అంశాల ను ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అందించే శిక్షణతో స్వయం ఉపాధి పొందాలని సూచించారు. మహి ళలు ఆర్థిక పరిపుష్ఠి సాధించాలని ఆకాంక్షించారు. శిక్షణలో అందించిన యూనిఫాంలు, డ్రెస్సులు, ఇతర క్లాత్ ఉత్పత్తుల తయారీలో వినియోగించాలన్నారు. అలాగే పార్కులో పలు యూనిట్లలో ప్రభుత్వ విద్యా లయాల విద్యార్థులకు అందించే స్కూల్ యూని ఫామ్ క్లాత్ మరమగ్గాలపై సిద్ధమవుతుండగా పరిశీ లించారు. ఉత్పత్తి ఎప్పటివరకు పూర్తవుతుందని ఆరాతీశారు. త్వరగా లక్ష్యం పూర్తిచేయాలని, యూని ఫాంలు కుట్టించి విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో చేనేత జౌళి శాఖ ఏడీ సంతోష్, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, ఎంపీవో మీర్జా, చేనేత జౌళి శాఖాధికారి రవీందర్ తదితరులు ఉన్నారు.