ట్రాన్స్‌జెండర్లకు స్వయం ఉపాధి..
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:14 AM
పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ పథ కాలు ట్రాన్స్‌జెండర్స్‌కు స్వయం ఉపాధి కల్పించడంలో కీలక పాత్రను పోషిస్తు న్నాయని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హన్మంతు అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ పథ కాలు ట్రాన్స్‌జెండర్స్‌కు స్వయం ఉపాధి కల్పించడంలో కీలక పాత్రను పోషిస్తు న్నాయని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హన్మంతు అన్నారు. మంగళ వారం జిల్లా కేంద్రం సర్దార్‌నగర్ ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ఫర్ కమ్యూనిటీ ఎంపవ ర్‌మెంట్ ఆధ్వర్యంలో పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ పథకాలపై అవగాహన సద స్సును నిర్వహించారు. ముఖ్య అతిథి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హన్మంతు మాట్లాడుతూ ఇన్ఫోసెమ్ సంస్థ ట్రాన్స్‌జెండర్స్ హక్కుల పరిరక్షణ, సామాజిక అభివృద్ధి, స్వావలంబన కోసం కృషి చేస్తుందన్నారు. ట్రాన్స్‌జెండర్స్ చాలా మంది ఉపాధిలేక భిక్షాటన వంటి పరిస్థితులకు దారితీస్తున్నాయని ఆవే దన వ్యక్తం చేశారు. కుటుంబం సమాజం నుంచి వెలివేయబడిన వారు జీవన పాధిలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఈనేపథంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎం పథకాలు ట్రాన్స్‌జెండర్స్‌కు ఉపాధి కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకో వాలన్నారు. పీఎంఈజీపీ జిల్లా మేనేజర్ జయంత్ మాట్లాడుతూ పీఎంఎఫ్‌ఎం పథకం ద్వారా సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక సమాయం, శిక్షణ, మార్కెటింగ్ మద్దతు లభిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా యువకులు, ట్రాన్స్ జెండర్స్ చిన్నస్థాయి వ్యాపారులను ప్రారంభించి ఆదాయం పెంచుకునే అవకా శాలున్నాయన్నారు. ప్రభుత్వాలు పలు రకాల ప్రోత్సహాలను అందిస్తూ రుణ సౌకర్యాలు సబ్సిడీలు అందిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ మేనేజర్ శివసాయికృష్ణ, ఇన్ఫోసెమ్ అధ్యక్షుడు మహేష్, కోశా ధికారి దినేష్, సభ్యుడు శ్రీనివాస్, ప్రాజెక్టు మేనేజర్లు జ్యోతి, లక్ష్మణ్, సిబ్బంది, ట్రాన్స్‌జెండర్స్ పాల్గొన్నారు.