‘స్వయం’కృషి
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:34 AM
పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో పోటీపడుతున్నారు. వివిధ ఉపాధి మార్గాలతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు విస్తరించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. మహిళల్లో పారిశ్రామిక ధృక్పథాన్ని పెంపొందించి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో ఇందిరా మహిళా శక్తి ముఖ్య పాత్ర పోషిస్తోంది. స్వశక్తి మహిళలు వ్యక్తిగత యూనిట్లను లేదా గ్రూపు యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన శిక్షణతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించి వారు రుణాలను సక్రమంగా చెల్లిస్తే వడ్డీ భారాన్నికూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- ‘ఇందిరా మహిళా శక్తి’తో స్వయం సహాయక సంఘాల బలోపేతం
- స్వయం ఉపాధితో మహిళల ఆర్థిక స్వావలంబన
- వివిధ రంగాల్లో రాణిస్తున్న ‘స్వశక్తి మహిళలు’
- వేగవంతంగా వ్యక్తిగత యూనిట్ల మంజూరు
- మెప్మా పీడీ స్వరూపరాణి
కరీంనగర్ టౌన, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో పోటీపడుతున్నారు. వివిధ ఉపాధి మార్గాలతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు విస్తరించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. మహిళల్లో పారిశ్రామిక ధృక్పథాన్ని పెంపొందించి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో ఇందిరా మహిళా శక్తి ముఖ్య పాత్ర పోషిస్తోంది. స్వశక్తి మహిళలు వ్యక్తిగత యూనిట్లను లేదా గ్రూపు యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన శిక్షణతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించి వారు రుణాలను సక్రమంగా చెల్లిస్తే వడ్డీ భారాన్నికూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం పట్టణ ప్రాంతాల్లోనే అమలు చేస్తుండడంతో జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో అమలవుతోంది.
ఫ లక్ష్యాన్ని మించి యూనిట్ల స్థాపన
కరీంనగర్ కార్పొరేషనలో 5,539 స్వయం సహాయక సంఘాల్లో 55,119 మంది సభ్యులుండగా 190 ఏరియా లెవల్ ఫెడరేషన సంఘాలు, 5 టౌన లెవల్ ఫెడరేషన్స ఉన్నాయి. హుజూరాబాద్ మున్సిపాలిటీలో 557 స్వశక్తి సంఘాల గ్రూపుల్లో 6,101 మంది సభ్యులు, 27 ఏరియా లెవల్ ఫెడరేషన సంఘాలు, ఒకటి టౌన లెవల్ ఫెడరేషన ఉంది. జమ్మికుంట మున్సిపాలిటీలో 695 గ్రూపుల్లో 7,250 మంది సభ్యులు, 28 ఏరియాల లెవల్, ఒకటి టౌన లెవల్ ఫెడరేషన ఉంది. చొప్పదండి మున్సిపాలిటీలో 387 స్వశక్తి సంఘాల గ్రూపులు ఉండగా 3,818 సభ్యులు, 13 ఏరియా లెవల్, ఒకటి టౌన లెవల్ ఫెడరేషన ఉంది. జిల్లాలో మొత్తం 7,178 స్వయం సహాయక సంఘాల్లో 72,288 మంది మహిళలు, 258 ఏరియా లెవల్ ఫెడరేషన్లు, ఎనమిది టౌన లెవల్ ఫెడరేషన ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా లబ్ధిపొందు తున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు వ్యక్తిగతంగా లేదా సంఘం గ్రూపుగా కూడా ఇందిరా మహిళా శక్తి ద్వారా యూనిట్లను స్థాపించుకొని ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. గత ఏడాది ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వ్యక్తిగత సభ్యులకు 393 యూనిట్ల ద్వారా 1375.50 లక్షల ఆర్థిక ప్రయోజనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యాన్ని అధిగమించి 394 యూనిట్లను స్థాపించి 1043.47 లక్షల రుణాలతో వ్యాపార లావాదేవీలను కొనసాగించారు. ఈ యేడు యూనిట్ల సంఖ్యను 552 పెంచడంతో పాటు రుణ సదుపాయాలను 1932.00 లక్షలకు పెంచాలని టార్గెట్‌గా విధించారు. ఇప్పటికే 93 యూనిట్లను ప్రారంభించి 265.50 లక్షల రుణాలను తీసుకున్నారు. అలాగే గత ఏడాదిలో 68 స్వయం సహాయక సంఘాల గ్రూపులు 68 యూనిట్లను ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకోగా 52 యూనిట్లకు 475 లక్షల రుణాలను అందించారు.
ఫ రుణాలు సక్రమంగా చెల్లిస్తే వడ్డీ మాఫీ
ఈ పథకం ద్వారా రుణాలను పొంది మిల్క్ డైరీ, క్యాంటీన, ఫిలిగ్రీ, ఫ్లోర్‌మిల్స్, బోటిక్స్, పూజా స్టోర్స్, జిరాక్సు మిషన్లు, స్టిచ్చింగ్ సెంటర్లు, గార్మెంట్స్, హోమ్ ఫుడ్స్, కోల్డ్ ప్రాసెస్డ్ ఆయిల్స్, సర్జికల్ మాస్క్‌ల తయారి, డ్రై వాష్ సెంటర్లు, సిరి ధాన్యాలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స, సెంట్రింగ్ యూనిట్లు, బ్రిక్స్ తయారీ యూనిట్లు, బర్తన బ్యాంక్స్, క్లాత, జ్యూట్ యూనిట్లు, సోప్స్ తయారీ, బ్యూటీ పార్లర్లు, ప్లాస్టిక్ వైరు బుట్టల తయారీ, సానిటరీ ఐటమ్స్ తయారీ వంటి యూనిట్లను స్థాపించి వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తూ వారి స్వయం ఉపాధి పొందడమే కాకుం డా మరెందరికో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. వీటితో పాటు ఎగ్ కార్ట్స్, హాండీ క్రాఫ్. ఫిష్ ఔట్‌లెట్లు, పెట్రోల్ బంకులు, అగ్రిగేటర్స్ వంటి యూనిట్లనుకూడా ఈ పథకం ద్వారా మంజూరు చేసి వారికి ఆయా రంగాల్లో శిక్షణ ఇప్పించి యూనిట్ల స్థాపనకు రుణాలను మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా రుణాలను తిరిగి చెల్లించిన యూనిట్ల నిర్వాహకులకు జీరో వడ్డీ మాఫీ పథకం కింద ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన... ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల పరిధిలోని 1,126 స్వయం సహాయక సంఘాలకు 4 కోట్ల 36 లక్షలను జీరో వడ్డీ కింద ఆర్థికసాయం అందించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 2,491 స్వయం సహాయక సంఘాలకు 20.03 కోట్ల రూపాయల జీరో వడ్డీ కింద ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించగా త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం.
ఫ లక్ష్యం చేరుకునేందకు అవగాహన కల్పిస్తున్నాం
- స్వరూపరాణి , మెప్మా పీడీ
పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి, వారు ఎంచుకున్న యూనిట్ల స్థాపనకు సహకారం అందిస్తున్నాం. వ్యక్తిగతంగా, గ్రూపులుగా రుణాలు తీసుకొని వివిధ రకాల యూనిట్లను స్థాపించి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం వ్యక్తిగత యూనిట్లను పెంచడంతో పాటు వారికి రుణాలను ఎక్కువగా ఇప్పించేందుకు కృషిచేస్తున్నాం.