Share News

26 నుంచి స్వీయ గణన

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:24 AM

స్వీయ గణన ప్రక్రియ ఈనెల 26 వ తేదీ నుంచి మొదలుకానున్నదని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

26 నుంచి స్వీయ గణన

సిరిసిల్ల, ఏప్రిల్‌ 10 (ఆం ధ్రజ్యోతి): స్వీయ గణన ప్రక్రియ ఈనెల 26 వ తేదీ నుంచి మొదలుకానున్నదని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. జన గణన-2027లో భాగంగా మొదటి దశ ఇళ్ల గణనపై శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర జనాభా గణన కార్యాల యం జేడీ సుబ్బరాజు, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, ముఖ్య ప్రణాళిక శాఖ అధికారులు, ఆర్డీవోలు, ఛార్జ్‌ అధికారులు తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారితో ప్రిన్సిపల్‌ గణన అధికారితో కలిసి కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల26వ తేదీ నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకు స్వీయ గణన జిల్లాలో నిర్వహించనున్నామని తెలిపారు. అన్నిశాఖల అధికారులు, సిబ్బంది జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీయగణన చేసుకోవాలని పేర్కొ న్నారు. సర్పంచులు, కౌన్సిలర్‌లు, వార్డు సభ్యులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు వారి మొబైల్‌ ఫోన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జనాభా గణన మొదటి దశకు సంబంధించి శిక్షణ తరగతులు ఈనెల 20 వతేదీ నుంచి నిర్వహించనున్నారని వెల్లడించారు. సీఎం ఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా హౌస్‌లిస్టింగ్‌ బ్లాక్‌ క్రియేషన్‌, కార్వింగ్‌ ఈనెల 11వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీన జిల్లాలో ఇప్పటికే ఎన్యు మరేటర్లు సూపర్వైజర్లుగా నియమించిన వారికి సంబంధించిన ఉత్తర్వుల కాపీలు, గుర్తింపు కార్డులు జారీచేయాలని సూచించారు. శిక్షణకు సంబంఽ దించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, సరైన వసతులు కల్పిం చాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జన గణన జిల్లా ఇన్‌చార్జి తిరుప తి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ముఖ్య ప్రణాళిక అధికారి పీబీ శ్రీనివాసాచారి, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పా షా, సంపత్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి షరీఫోద్దిన్‌, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:25 AM