Share News

స్వీయ గణన షురూ..

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:41 AM

జనగణన-2027లో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందస్తుగా జనగణనకు అవకాశం కల్పించిన సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది.

స్వీయ గణన షురూ..

సిరిసిల్ల, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): జనగణన-2027లో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందస్తుగా జనగణనకు అవకాశం కల్పించిన సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలిరోజు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బీ గితేలతో పాటు అధికారులు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ పూర్తి చేశారు. ఆదివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జనగ ణన-2027లో భాగంగా ఈనెల 26వ తేదీ నుంచి మేనెల 10వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయ గణన ప్రక్రియ కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ స్వీయ గణన చేసుకున్నారు. కలెక్టరేట్‌ ఏర్పాటుచేసిన స్వీయ గణన సెల్ఫీ పాయిం ట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జన గణన- 2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఈ.ఎన్‌ఎస్‌యూఎస్‌.జీఓవి.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా లాగిన్‌ కావాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 5నిమిషాల సమ యం పడుతుందని, వెబ్‌సైట్‌ పూర్తిస్థాయిలో సురక్షితమని స్పష్టం చేశారు. ప్రజల సమాచారం పూర్తి భద్రంగా ఉంటుందని వెల్లడించారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు ఇచ్చామని తెలిపారు. జిల్లాలోని ప్రజలు సర్వే కోసం వచ్చే వారికి 34 ప్రశ్న లకు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. స్వీయ గణనలో భాగంగా ప్రజలు ఇచ్చే సమాచారంతో ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించ డంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి వచ్చేనెల 10వ తేదీవరకు స్వీయ గణన జిల్లాలో నిర్వహించనున్నామని తెలి పారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీయ గణన చేసుకోవాలని పేర్కొన్నారు. సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు వారి మొబైల్‌ ఫోన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జనగణన సంబంధించి 1025 మంది ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి జనగణన అని, డిజిటల్‌ విధా నంలో చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు 1117 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాకులు గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీవో శ్రీనివాసాచారి, ఈడీఎం శ్రీనివాస్‌, ఎస్‌వో సంపత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 12:41 AM